కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమేనా?

ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక అనే అంశం రకరకాల సందర్భాలలో చర్చకు వచ్చి హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సందర్భంగా బరిలో ఉన్న పార్టీలు విజయం సాధించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి ఉంది.

 Is This Decision Taken By Kcr For Huzurabad By-election, Trs Party, Kcr, Kcr Ass-TeluguStop.com

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ లో గెలుపొందడం చాలా ముఖ్యం కాబట్టి విజయం సాధించడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్న పరిస్థితి ఉంది.అయితే ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రణాళికలు కాని ఎత్తుగడలు కాని అంత తొందరగా అంతుపట్టవు అంతేకాక వ్యూహం కూడా చాలా పకడ్భందీగా ఉంటుందనే విషయం జగమెరిగిన సత్యం.

అయితే ఇప్పుడు కెసీఆర్ దృష్టంతా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఉందన్న విషయం తెలిసిందే.కావున ఈ ఎన్నిక ముగిసే వరకు ముఖ్యమంత్రి కెసీఆర్ తీసుకునే  ఏ నిర్ణయమైనా హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి లాభించే దిశగానే ఉంటాయి.

అయితే తాజాగా జరిగిన అసెంబ్లీలో కెసీఆర్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణను చేపట్టాలని తీర్మాణం చేసిన విషయం తెలిసిందే.అయితే కెసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న బీసీలకు కూడా అన్ని రకాల రంగాలలో స్థానం దక్కాలంటే బీసీ కుల గణన అనేది తప్పక చేపట్టాలని వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.

Telugu Cm Kcr, Dalita Bandhu, Dalits, Etela Rajender, Kcrassembly, Kcr, Kcrtarge

అయితే హుజూరాబాద్ లో బీసీల సంఖ్య కూడా ఎక్కువే కాబట్టి పరోక్షంగా బీసీలను సంతృప్తి పరిచిన పరిస్థితి ఉంది.అయితే ఈ తీర్మానం ద్వారా బీసీలను, దళిత బంధు ద్వారా దళితులను సంతృప్తి పరిచి  టీఆర్ఎస్ అనుకూల ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా వ్యూహం రచించిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు ఈ వ్యూహం గనుక ఫలిస్తే టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube