ఇది మరో మల్టీస్టారర్‌ సినిమాకు నాంధి కాబోతుందా?  

Is This Can Be A Other Multistarrer-

ఈమద్య కాలంలో వరుసగా వెంకటేష్‌ మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తున్నాడు.తాజాగా ఎఫ్‌ 2 చిత్రంతో వెంకటేష్‌ మంచి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఈ నేపథ్యంలోనే వెంకీ మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఎఫ్‌ 2 చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంకీ మామ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఇక ఈ చిత్రం మాత్రమే కాకుండా వెంకీ వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తాడని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది...

Is This Can Be A Other Multistarrer--Is This Can Be A Other Multistarrer-

తాజాగా వెంకటేష్‌ పనిగట్టుకుని, వెంకీ మామ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ వేసి మరీ ‘జెర్సీ’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు.నానిపై ఉన్న అభిమానంతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

వీరిద్దరి కాంబోలో మూవీ ఉండబోతుందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.తాజాగా వీరిద్దరు ఒకే వేదికపై కనిపించడంతో వీరిద్దరు కలిసి నటిస్తారు అనే చర్చ జరుగుతోంది.చాలా కాలంగా వీరిద్దరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Is This Can Be A Other Multistarrer--Is This Can Be A Other Multistarrer-

తప్పకుండా వీరిద్దరు కలిసి నటిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

నాని మరియు వెంకటేష్‌లు కలిసి నటిస్తే చూడాలని ఆశ పడుతున్న ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌కు వీరిద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడంతో అంచనాలు భారీగా పెరిగి పోయాయి.వీరిద్దరు కలిసి తప్పకుండా త్వరలోనే నటిస్తారనే నమ్మకం ఈ ఫొటోతో మరింత ఎక్కువ అయ్యిందని అంటున్నారు.ప్రస్తుతం చర్చల దశలో వీరిద్దరి కాంబో మూవీ ఉన్న కారణంగానే జెర్సీ ప్రీ రిలీజ్‌ వేడుకకు వెంకీ హాజరు అయ్యి ఉంటాడనే టాక్‌ వినిపిస్తుంది.

మరి వీరిద్దరి కాంబోకు సంబంధించిన వార్త ఎప్పుడు వింటామో చూడాలి.