వారానికి ఏడు రోజులే ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వెనుక ఇంత రహస్యం దాగుందా..?

ఒక వారం అంటే ఏడు రోజులు అని మనందరికి తెలిసిన విషయమే.చిన్నపిల్లాడిని అడిగినా వారానికి ఏడు రోజులు ఉంటాయని చెప్పేస్తాడు.

 Is There Such A Secret Behind The Question Of Why There Should Be Only Seven Day-TeluguStop.com

ఆదివారం దగ్గర నుండి శనివారం వరకు మొత్తంగా మనకు ఏడు వారలు ఉన్నాయి.అయితే మీకు ఎప్పుడన్నా అసలు వారానికి ఏడు రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయి.

ఐదు రోజులు ఉండొచ్చుగా లేదంటే ఎనిమిది రోజులు ఉండొచ్చుగా అనే అనుమానం వచ్చిందా.అసలు వారంలో ఏడు రోజులు మాత్రమే ఎందుకు ఉండాలి, అది ఎలా నిర్ణయించారు.? ఎవరు నిర్ణయించారు.? అనే విషయాలు తెలుసుకుందామా.! నిజానికి వారానికి ఎన్ని రోజులు ఉండాలనే విషయం మీద చాలా మంది అధ్యయనం చేశారు.ఖాగోళంలో ఉండే గ్రహాలు, సూర్య చంద్రుల కదలికల ఆధారంగా రకరకాల తీర్మానాలు చేశారు.

ఈ పరిశోధనలో భాగంగా బాబిలోన్ ప్రజలు అంటే ప్రస్తుత ఇరాక్ ప్రజలు ఖగోళ గణనాలలో చాలా నైపుణ్యం, అభివృద్ధి చెందారు.నిజానికి వారానికి 7 రోజులు అనే కాన్సెప్ట్‌తో వారే ముందుకు వచ్చారని ప్రముఖ పత్రిక వెల్లడించింది.

ఖగోళంలో గల గ్రహ కదలికల నుండి ఏడు రోజులను ఒక వారంలాగా స్వీకరించారు పరిశోధకులు.అంటే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, వీనస్, మార్స్, బృహస్పతి గ్రహాల కదలికలను వారు గమనించారు.

చంద్రుని 28 రోజుల కక్ష్య ఆధారంగా వారానికి 7 రోజులు నెలకు నాలుగు వారాలుగా నిర్ణయించారు.ఈ సమయంలో ఈజిప్టు రోమ్‌ లలో వారం ఎనిమిది లేదా పది రోజులు ఉండేవి.

అయితే అలెగ్జాండర్ మాత్రం భారతదేశంలో గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు.అలా ఏడు రోజులు వారం అనే భావన భారతదేశానికి వ్యాపించింది.

ఆ తర్వాత, చైనా దేశం కూడా మనల్ని అనుసరించి ఈ ఏడు రోజుల వారాన్ని ప్రారంభించారట.అలాగే వారానికి ఏడు రోజులలాగా కొన్ని గ్రహాల పేర్లు పెట్టారు.రోమ్‌లో ఈ విషయం గురించి చాలా ప్రయోగాలు జరిగాయి.ఇస్లాం, జుడాయిజం ప్రజలు వారానికి 6 రోజులు పని చేసి, మిగిలిన ఒక రోజు మతపరమైన పనుల కోసం కేటాయించడం ప్రారంభించారు.

ప్రస్తుతం ప్రజలందరికీ అదే వర్తించింది.దీని తర్వాత ఒక్కో గ్రహానికి ఒక రోజును నిర్ణయించారు.ఒక్కో రోజుకి ఒక్కో గ్రహం పేరు పెట్టారు.శని, చంద్రుడు,కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, సూర్యుడనే గ్రహాలను ఒక్కో రోజుకు పెట్టారన్నమాట.

కొన్ని వారాల పేర్లు మరాఠీ భాషలో ఉండడం గమనార్హం.

Why Seven Days in a Week History of Seven Days in a Week #Week

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube