ఏపీలో కొత్త రాజ‌కీయ శ‌క్తి ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన‌ప్ప‌టి నుంచి ఆర్థికంగా చాలా వెన‌క‌బ‌డిపోయింది.తెలంగాణ‌తో క‌లిసున్న‌ప్ప‌టి కంటే కూడా చాలా అప్పుల పాల‌యిపోయింది.

 Is There No New Political Force In Ap Now Ap Politics-TeluguStop.com

కొత్త రాష్ట్రానికి మొద‌టి సీఎంగా చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇచ్చారు ఏపీ ప్ర‌జ‌లు.అయితే ఆయ‌న్ను ఐదేళ్ల త‌ర్వాత దించేసి జ‌గ‌న్‌కు ప‌గ్గాలు ఇచ్చారు.అయినా కూడా ఆర్థికంగా పెద్ద లాభం ఏమీ చేకూర‌లేదు.ఇలాంటి త‌రుణంలో ఇంకే కొత్త రాజ‌కీయ పార్టీకి అధికారం ఇచ్చి మ‌రో ప్ర‌యోగం ఏపీ ప్ర‌జ‌లు చేస్తారా అన్న అనుమానాలు రాక మాన‌వు.

ఎందుకంటే ఇప్ప‌టికే ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చేశారు ఏపీ ప్ర‌జ‌లు.

 Is There No New Political Force In Ap Now Ap Politics-ఏపీలో కొత్త రాజ‌కీయ శ‌క్తి ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్ద‌రికంటే బ‌ల‌మైన నేత‌లు ఎవ‌రూ కూడా ఏపీ రాజ‌కీయాల్లో లేరు.

టీడీపీకి ఆల్రెడీ అవ‌కాశం ఇచ్చిన త‌ర్వాతే వైసీపీకి అవ‌కాశం ఇచ్చారు ఆంధ్రా ప్ర‌జ‌లు.ఇక అప్పులు అప్పుడైనా ఇప్పుడైనా అవి కామ‌న్‌గానే ఉంటున్నాయి.

ఇలాంటి త‌రుణంలో ఎవ‌రు ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్నార‌నే అంశంపైనే రాబోయే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉంటాయి.ఎందుకంటే ఇప్ప‌టికిప్పుడు ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అయితే మెరుగుప‌డే అవ‌కాశం లేదు.

ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన లాంటి పార్టీ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబోయే ఎన్నిక‌ల్లో సీఎం అవుతార‌ని ప‌దే ప‌దే చెబుతోంది.

Telugu About Chandra Mohan, Ap Cm Jagan, Ap News, Ap Politics, Is There No New Political Force In Ap Now, Janasena, Pavan Kalyan, Tdp, Ysrcp-Telugu Political News

మ‌రి నిజంగా ప‌వ‌న్‌కు ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తారా అనేది ఒక‌సారి బేరీజు వేసుకుంటే గ‌న‌క ఏపీ ప్ర‌జ‌లు పూర్తిగా వ్యవసాయం మీద‌నే ఆధార ప‌డి బ్ర‌తుకుతున్నారు.రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయ వ‌న‌రులు కూడా లేవు.ఇలాంటి త‌రుణంలో కొత్త‌గా ప‌వ‌న్‌ను గెలిపించే ఆస్క‌రాలు క‌నిపించ‌ట్లేదు.

ఎందుకంటే జ‌గ‌న్ వ్య‌వ‌సాయానికి చేయాల్సినంత సాయం చేస్తూనే ఉన్నారు.కాబ‌ట్టి ప్ర‌త్యామ్నాయ శ‌క్తులు మాత్రం ఇప్ప‌ట్లో పుట్టుకుని వ‌చ్చే అవ‌కాశం లేద‌నే చెప్పాలి.

ప‌రిశ్ర‌మ‌ల్లాంటివి కూడా కొత్త‌గా వ‌చ్చేవి లేద‌నే అర్థ‌మ‌వుతోంది.మొత్తంగా ఎటు చూసిన జ‌గ‌న్‌, చంద్ర‌బాబును మిన‌హాయించి ఇప్ప‌ట్లో కొత్త రాజ‌కీయ శ‌క్తిమాత్ర వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని తెలుస్తోంది.

.

#Janasena #Pavan Kalyan #AP CM Jagan #Chandra Mohan #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు