అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

Is There No Chance For Akkineni Family Heros

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని అంటేనే ఓ బ్రాండ్ ఉంది.ఇక చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వేసిన పునాది అలాంటిది మరి.

 Is There No Chance For Akkineni Family Heros-TeluguStop.com

నాగేశ్వర్ రావు నటవారసుడిగా నాగార్జున అప్పట్లో ఎంట్రీ ఇచ్చి,ఎన్నో హిట్స్ అందుకున్నారు.అయితే టాలెంట్ తో ఎదిగి, టాలీవుడ్ సినియర్ స్టార్ హీరోల జాబితాలో నాగార్జున పేరు ముందు వరుసలోచేరారు.

అంతేకాదు.నాగార్జున తోటి హీరోలకు అప్పట్లో గట్టి పోటీ ఇచ్చారు.

 Is There No Chance For Akkineni Family Heros-అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా.ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను చేసిన నాగార్జునకు వంద కోట్ల మార్క్ సాధ్యం అవ్వలేదు.ఇక ప్రస్తుతం హీరోలు అంతా కూడా వంద కోట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే కనీసం ఒక్క వంద కోట్ల సినిమా అయినా చేయాలని ఆశ ఉందట.

ఇక నాగార్జున అప్పట్లో పోటిపడ్డ హీరోలు ఏదో విధంగా వంద కోట్లను టచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక యంగ్ స్టార్ హీరోలకు ఈమద్య కాలంలో వంద కోట్ల బిజినెస్.

వంద కోట్ల వసూళ్లు అనేది చాలా కామన్ గా మారింది.అయితే నాగార్జున అలాంటి క్రెడిట్ కొట్టకపోయినా కనీసం ఆయన నట వారసులయినా వంద కోట్ల జాబితాలో చేరుతారేమో అనుకుంటే వారు కూడా సక్సెస్ ల కోసం కిందా మీద పడుతూనే ఉన్నారు.

Telugu Akhil, Akkineni, Chanceakkineni, Nagachaitanya, Nagarjuna, Senior Heroes, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అయితే అఖిల్ పై చాలా ఆశలు పెట్టుకుంటే, ఇంకా మొదటి సక్సెస్ కోసం ఎదురుచూడటమే సరిపోతుంది.ఇక మరోపక్క నాగచైతన్య నుండి మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే.కాగా.టాలీవుడ్ పెద్ద కుటుంబాల్లో ఒక కుటుంబం అయిన అక్కినేని కుటుంబం కనీసం ఒక్కటి అంటే ఒక్కటి కూడా వంద కోట్ల సినిమా లేక పోవడం సిగ్గు చేటు అంటూ యాంటీ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.

అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా అఖిల్ ప్రస్తుతం ఉన్న యువ హీరోలకు ధీటుగా నిలవడంతో పాటు రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న నటుడు అఖిల్ అనే నమ్మకం ఉందంటూ చెప్పుకొస్తున్నారు.

#Akkineni #Nagarjuna #ChanceAkkineni #Nagachaitanya #Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube