టీడీపీ తో పొత్తు లేనట్టేనా ? ' ఢిల్లీ ' సంకేతాలు ఇవేనా ? 

2024 ఎన్నికల చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.వైసీపీ 175 స్థానాలు దక్కించుకుంటాయని వైసిపి ధీమా వ్యక్తం చేస్తుండగా,  ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రానివ్వము అంటూ టిడిపి,  జనసేన , బిజెపిలు చెబుతున్నాయి.

 Is There No Alliance With Tdp? Are These The Signs Of Delhi ,janasena, Pavan Kal-TeluguStop.com

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు.పదేపదే వైసిపి అంశాన్ని ప్రస్తావిస్తూ,  ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చూసేందుకు  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్ష పార్టీలన్నిటిని కలుపుకు వెళ్లి వైసీపీని ఓడిస్తామంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.

ముఖ్యంగా టిడిపి , బిజెపి ,( TDP, BJP Janasena )జనసేన కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలను పవన్ ఎప్పటి నుంచో ఇస్తున్నారు.అయితే బిజెపి మాత్రం టిడిపిని కలుపుకు వెళ్లేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.

Telugu Amith Sha, Chandrababu, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalyan, Tdp

గతంలో టిడిపి , బీజేపీ పొత్తు ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు , బిజెపి నాయకులు విషయంలో టిడిపి వ్యవహరించిన తీరు,  అలాగే కేంద్ర హోం మంత్రి కుటుంబ సభ్యులు తిరుమలలో పర్యటిస్తున్న సమయంలో వారిపై రాళ్లదాటికి పాల్పడడం ఇవన్నీ బిజెపి పెద్దలు సీరియస్ గానే తీసుకున్నారు.అందుకే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్న,  బిజెపి పెద్దలు మాత్రం టిడిపిని దూరం పెడుతూనే వస్తున్నారు.  అయితే ఏపీలో వైసీపీ ఓడించేందుకు టిడిపి, బిజెపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ భావిస్తుండడంతో,  ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో బిజెపి పెద్దలను దానికి ఒప్పించాలని ప్రయత్నించారు .కానీ పవన్ కు బిజెపి కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) అపాయింట్మెంట్ లభించలేదు .

Telugu Amith Sha, Chandrababu, Janasena, Janasenani, Jp Nadda, Pavan Kalyan, Tdp

కేవలం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  పార్టీ ఇన్చార్జి మురళిదరన్ తో మాత్రమే పవన్ భేటీ కాగలిగారు.అయితే రాజకీయంగా టీడీపీ తో పొత్తు పై బిజెపి పెద్దలను ఒప్పించాలని ప్రయత్నించినా,  వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో,  పవన్ నిరాశ గానే ఢిల్లీ పర్యటనను ముగించుకోవాల్సి వచ్చింది.తనుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట  సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న,  కేంద్ర బిజెపి పెద్దలను కలవాలని , పొత్తుల వ్యవహారాన్ని తేల్చాలని పవన్ భావించైనా, టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టం లేని బీజేపీ పెద్దలు పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కర్ణాటకలో పవన్ తో ఎన్నికల ప్రచారం చేయించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చి , ఏపీలో బీజేపీ జనసేన కలిసి వైసిపిని ఎదుర్కొంటాయనే విషయాన్ని పవన్ తో బిజెపి పెద్దలు చెప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube