తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు మళ్లీ ఆ గడ్డు రోజులు రాబోతున్నాయా?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఫిబ్రవరి మరియు మార్చిల్లో కళకళలాడాయి.కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లలో ఈగలు తోలుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం క్రాక్‌.

 Is There Corona Second Wave Effect To Theaters In Telugu States-TeluguStop.com

ఉప్పెన మరియు జాతి రత్నాలు.వకీల్‌ సాబ్‌ ఇంకా కొన్ని సినిమాల తో బాక్సాఫీస్ వద్ద సందడిగా మారాయి.

టాలీవుడ్‌ మంచి జోరు మీదున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఆందోళన కలిగిస్తుంది.థియేటర్లు మళ్లీ జనం లేక విల విల లాడిపోతున్నాయి.

 Is There Corona Second Wave Effect To Theaters In Telugu States-తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు మళ్లీ ఆ గడ్డు రోజులు రాబోతున్నాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మద్య మంత్రి తలసాని మాట్లాడుతూ థియేటర్ల విషయంలో ఎలాంటి ఆంక్షలను పెట్టడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.కాని జనాలు మాత్రం థియేటర్ల వద్ద కు వెళ్లాలంటే ఆసక్తి చూపించడం లేదు.

కరోనా కారణంగా జనాలు థియేటర్లకు వెళ్లేందుకు భయపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అరడజను పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.చిన్నా చితకా సినిమాలు విడుదల అయితే వాటిని చూసేందుకు జనాలు వస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది.

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి మళ్లీ గత ఏడాది మాదిరిగా మారే ప్రమాదం ఉందా అంటే ఏం లేదు అంటూ అధికారులు చెబుతున్నారు.కాని అనధికారికంగా థియేటర్లు మూత పడే పరిస్థితి రావచ్చు అంటున్నారు.

ప్రేక్షకులు రాని థియేటర్లు ఓపెన్‌ చేసి ఏం లాభం అనేది కొందరి వాదన.ఆ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లను తాత్కాలికంగా మూసి వేసే పరిస్థితి రావచ్చు అంటున్నారు.

మొత్తానికి థియేటర్లు మళ్లీ మునుపటి స్థితికి వచ్చాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు అయ్యి ఆందోళన కలిగిస్తుంది.పెద్ద ఎత్తున ఈ విషయమై సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

జూన్‌ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదు అంటూ ఉన్నారు.కేంద్రం నాలుగు వారాలు చాలా కీలకం అంటూ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

కనుక నాలుగు అయిదు వారాలు థియేటర్ల వంక జనాలు వస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

#TeluguStates #Jathi Ratnalu #Vakeel Saab #Uppena #CoronaSecond

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు