ప్రెస్ మీట్​ పెట్టకుండా కేసీఆర్ వెళ్లిపోవడానికి రీజన్ అదేనా.. అసలేమైంది..

నిన్న కేబినేట్​ భేటీ ముగిసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రెస్ మీట్​ ఏర్పాటు చేస్తారని అంతా ఎదురు చూశారు.ఈ సారి ప్రెస్ మీట్​ కు ఆయన జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు.

 Is There Any Reason For Kcr To Leave Without Holding A Press Meet , Trs,kcr-TeluguStop.com

కానీ ఏమైందో ఏమో తెలియదు ప్రెస్ మీట్​ కు రాకుండానే ఆయన వెళ్లిపోయారు.ఆయన ప్రెస్ మీట్​ ఏర్పాటు చేస్తే ఏ విషయాలను చెబుతారని పలువురు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.

అలా ఎదురు చూసిన వారందరికీ కేసీఆర్ నిరాశనే మిగిల్చారు.ఆయన ప్రెస్ మీట్​ ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను కూడా ప్రస్తుతం కొంత మంది విశ్లేషిస్తున్నారు.

ఈ కారణం వల్లే నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్​ ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు.కేసీఆర్ ప్రెస్ మీట్​ ఏర్పాటు చేయకపోవడానికి వారు చెప్పే కారణాలు ఏంటంటే.

బీజేపీకి పోటీగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు.అందుకోసమని మూడో ఫ్రంట్​ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.ఇది వరకే దేశంలో ఉన్న బీజేపీ యేతర ముఖ్యమంత్రులు మరియు పార్టీల అధినేతలతో చర్చలు సాగిస్తున్నారు.కానీ బీజేపీ మీద కేసీఆర్​  సాగిస్తున్న పోరాటానికి జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు రావడం లేదని ఈ సారి జాతీయ మీడియాను కూడా పిలిచారు.

కానీ చివరికి మీడియా సమావేశం ఏర్పాటు చేయకుండానే ఆయన వెనుదిరిగారు.ఒక వేళ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే థర్డ్​ ఫ్రంట్​ గురించే విలేకరులు ఎక్కువగా ప్రశ్నిస్తారని అందుకోసమే  ఈ ప్రెస్ మీట్​ ను ఆయన రద్దు చేసుకుని వెళ్లి ఉంటారనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ మీద టీఆర్ఎస్ సాగిస్తున్న యుద్ధం గురించి పూర్తిగా తెలుస్తుందనే ప్రెస్మీట్​ లేకుండా రద్దు చేసుకోవడంతో పలువురు నిరాశకు గురయ్యారు.మరలా కేసీఆర్ ఎప్పుడు ప్రెస్మీట్​ పెడతారా? అని ఎదురు చూస్తున్నారు.

Is There Any Reason For KCR To Leave Without Holding A Press Meet , Trs,kcr - Telugu Kcrleave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube