ఆ సమస్యతో బాధ పడుతున్న నాగార్జున.. నిజమేనా..?

ఆరుపదుల వయస్సులో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కింగ్ నాగార్జున.బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4లను విజయవంతంగా హోస్ట్ చేసిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

 Is There A Reason For  King Nagarjuna Silence,tollywood,bangarraju,nagarjuna,suf-TeluguStop.com

అయితే బిగ్ బాస్ షో తరువాత నాగార్జున మీడియాలో పెద్దగా కనిపించడం లేదు.నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తైనా ఆ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడలేదు.

Telugu Pain, Bangarraju, Gossips, Wild Dog-Latest News - Telugu

అయితే నాగార్జున కంప్లీట్ గా సైలెంట్ అయిపోవడానికి అసలు కారణం వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.నాగార్జున బ్యాక్ పెయిన్ తో బాధ పడుతున్నారని ఆ ఆరోగ్య సమస్య వల్లే నాగార్జున సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.నాగార్జున బంగార్రాజు స్క్రిప్ట్ పూర్తి కాగా నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.

నాగార్జున బ్యాక్ పెయిన్ కు చికిత్స తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుండగా నాగ్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తల గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే బ్యాక్ పెయిన్ ఉన్నా బిజినెస్ వ్యవహారాల్లో మాత్రం నాగ్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా గతంలో ఓటీటీలో విడుదలవుతున్నట్టు ప్రకటన వెలువడగా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు నాగార్జున బంగార్రాజు సినిమాలో ఒక యువ హీరోతో కలిసి నటిస్తాడని నాగచైతన్య ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో సక్సెస్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube