మోడీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వంసం వెనుక ఏం జరిగింది? కుట్ర ప్రకారమే విధ్వంసం సృష్టించారా? కేంద్ర నిఘా సంస్థలు ముందుగా హెచ్చరించినా రాష్ట్ర పోలీసులు పట్టించుకోలేదా? ఇంతటి విధ్వంసం జరుగుతుందని ఊహించలేదా? దక్షిణాది రాష్ట్రాల్లో హింసా, విధ్వంసాలు సృష్టించాలని అరాచక శక్తులు కుట్ర పన్నాయా?

 Is There A Conspiracy Going On Against Modi , Modi , Secunderabad Railway Statio-TeluguStop.com

దేశంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా? మోడీ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్ ఒక హ్యాష్ ట్యాగ్ రన్ అవుతోంది.ఒక కుట్రలో భాగంగానే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు, విధ్వంసానికి పూనుకుంటున్నారా? కొద్ది రోజుల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారంటూ…ముస్లిం సంఘాలు అనేక నగరాలు, పట్టణాల్లో హింసకు దిగాయి.తాజాగా ఆర్మీలో అగ్నిపథ్ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ రిక్రూట్ మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి.అగ్నిపథ్ తరహా విధానం ప్రపంచంలోని అనేక దేశాల్లో అమలవుతోంది.

అగ్ర రాజ్యం అమెరికాలో కూడా రెండు, నాలుగు, ఆరేళ్ళ రిక్రూట్ మెంట్ విధానం ఉంది.అనేక దేశాల విధానాలను పరిశీలించి చేసిన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, ఆర్మీ ఉద్యోగార్థులు ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నారు.

Telugu Bihar, Modi, Nupur Mohammad, Railway, Secunderabad, Topkingdom-Political

బీహార్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే ఆర్మీ కొత్త విధానాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లను ధ్వసం చేశారు.తాజాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.రైల్వే స్టేషన్ బయట బస్సులను ధ్వంసం చేస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వారంతా స్టేషన్ లోనికి వెళ్ళి ప్లాట్ ఫామ్స్ మీద ఉన్న స్టాళ్లను, తర్వాత స్టేషన్ ను, మూడు రైళ్ళను ధ్వంసం చేశారని చెబుతున్నారు.రైళ్లను తగులబెట్టారు.

వీరి విధ్వంసానికి ప్రయాణీకులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు.దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు స్టేషన్ కు చేరుకున్న వందలాది మంది ప్రయాణీకులు పిల్లా పాపలతో బయటకు పరుగులు తీసారు.

మొత్తం మీద జరగాల్సిన విధ్వంసం అంతా జరిగాక రైల్వే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు.కాల్పులు జరిపితే ఒక యువకుడు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.

Telugu Bihar, Modi, Nupur Mohammad, Railway, Secunderabad, Topkingdom-Political

సికింద్రాబాద్ స్టేషన్ మీద దాడి చేయడానికి కొన్ని రోజుల ముందే పథక రచన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని అందరూ ఏకమై ముందు రోజు రాత్రే కొందరు రైల్వే స్టేషన్ లోపలికి చేరుకున్నారు.మరికొన్ని వందల మంది రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మకాం వేశారు. మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న పథకం ప్రకారమే రైల్వే స్టేషన్ మీద దాడి అని అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube