ఇంట్లో బుద్ధుడు ప్రతిమ ఉందా? అయితే ఇది తెలుసుకోండి!

బుద్ధుడి విగ్రహం మనం తరచూ ఎటువంటి కార్యాలయాలలోనైన, యోగ శిక్షణ తరగతులలో, ఆస్పత్రి ఆవరణలలో బుద్ధుడు విగ్రహాలను ఉంచడం మనం గమనించే ఉంటాం.శాంతి, ప్రశాంతత, సామరస్యం అనే పదాలు బౌద్ధమతంతో ముడిపడి ఉన్నాయి.

 Is There A Buddha Statue In The House, Buddha Statue, House, Hindu Believes, Hindu Rituals-TeluguStop.com

బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుడి ప్రవచనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.అయితే కొంతమంది ఈ బుద్ధుడి విగ్రహాలను ఇళ్ళల్లో ఉంచుకోవడం చూసి ఉంటాము.

అయితే బుద్ధుడి విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం….

 Is There A Buddha Statue In The House, Buddha Statue, House, Hindu Believes, Hindu Rituals-ఇంట్లో బుద్ధుడు ప్రతిమ ఉందా అయితే ఇది తెలుసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన ఇంట్లో బుద్ధుడి విగ్రహాలు పెట్టినట్లయితే వాటిని నేలపై, చీపురు పెట్టే చోట, చెప్పులు వదిలే చోటకు ఎదురుగా ఉంచకూడదు.

బుద్ధుడి విగ్రహాలను ఎల్లప్పుడు నేలను తాకకుండా ఉండేలా చూసుకోవాలి.బుద్ధుడి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

బుద్ధుడి విగ్రహాలను టేబుల్ పై ఉంచుకోవడం గోడలపై పెయింటింగ్ లాగా వేసుకోవచ్చు.అంతేకాకుండా మరికొందరు విగ్రహాలను డబ్బులు దాచేసేటటువంటి లాకర్లలో బందిస్తుంటారు.ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.మన ఇంట్లో బుద్ధుడి ప్రతిమలను ఎల్లప్పుడు ముఖద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి.మన ఇంటిలోకి ప్రవేశించగానే ముందుగా మనకు బుద్ధుడు విగ్రహం కనిపించడం వల్ల మనస్సు ఎంతో ప్రశాంతతను కలిగి తేలికవుతుంది.

బుద్ధుడి ప్రతిమలో రెండు చేతులను దగ్గరగా ఉంచుకొని ఉన్న విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే మన లోపలి దృష్టిని చూపిస్తుంది.

అలా కాకుండా ఒక చేయి పైకి ఒక చేయి కింద ఉంటే అది కరుణ, నిర్భయతను తెలుపుతుంది బుద్ధుడి ప్రతిమ తన చూపుడు వేలు బొటన వేలును తాగుతున్నట్లు ఉంటే అజ్ఞానాన్ని సూచిస్తుంది.అయితే మన ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని యోగా శిక్షణ కేంద్రాలలో ఉంచుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube