వారి బలహీనతను బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టుబడిగా పెట్టారా?

బిగ్ బ్రదర్ కార్యక్రమం పేరుతో ఇతర దేశాలలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం మనదేశంలో బిగ్ బాస్ పేరిట ప్రసారమవుతూ విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.ఇప్పటికే ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను పూర్తి చేసుకుని కొనసాగుతోంది.

 Is Their Weakness Bigg Boss Management Are Putting Like An Investment Details, Bigg Boss, Tollywood, Comment, Telugu Film Industry, Bigg Boss Contestants, Bigg Boss Remuneration, Bigg Boss Season Six, Nagarjuna, Bigg Boss Non Stop,-TeluguStop.com

ఇకపోతే తెలుగులో ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తి చేసుకుని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే ఇతర భాషలలో ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లకు భారీ మొత్తంలో పారితోషకం ఆఫర్ చేస్తారు.

అయితే తెలుగులో ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో చాలా భిన్నంగా ఉంటుంది.తెలుగులో కంటెస్టెంట్లకు చాలా తక్కువ మొత్తంలో పారితోషికం అందిస్తారు.

 Is Their Weakness Bigg Boss Management Are Putting Like An Investment Details, Bigg Boss, Tollywood, Comment, Telugu Film Industry, Bigg Boss Contestants, Bigg Boss Remuneration, Bigg Boss Season Six, Nagarjuna, Bigg Boss Non Stop, -వారి బలహీనతను బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టుబడిగా పెట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో చాలా తెలివిని కనపరిచారు.తెలుగులో ఎంతోమంది తమకు పారితోషకం ఇవ్వకపోయినా పర్వాలేదు బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేసే అవకాశం కల్పిస్తే చాలు అని కోరుకుంటున్నారు.

ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో తమకు మంచి పాపులారిటీ వస్తుందని తద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.అందుకే చాలామంది పారితోషికం లేకపోయినా అవకాశం కల్పిస్తే చాలు అని కోరుకుంటున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ అవకాశం కోసం ఎదురు చూసేవారికి నిర్వాహకులు అవకాశం కల్పిస్తూ వారికి నామమాత్రపు పారితోషకం అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.ఈ విధంగా నిర్వాహకులు గత రెండు సీజన్ల నుంచి ఈ విధమైనటువంటి పద్ధతిని ఫాలో అవుతున్నారు.అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వెళ్లిన వారందరూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకొని ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో ప్రసారం కానందనే వార్తలు వినపడుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube