జనవరిలో కూడా ఇదే పరిస్థితి ఉంటే కష్టమే

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మార్చి నుండి థియేటర్లు మూత బడి ఉన్నాయి.లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా థియేటర్లను అనుమతించలేదు.

 Is Theater Open From Sankranthi  Coronavirus, Theaters, Movies, Central Governam-TeluguStop.com

ఎట్టకేలకు థియేటర్లకు కేంద్రం అనుమతించడంతో సినిమాల విడుదలకు ముహూర్తం కుదిరిందని అంతా భావించారు.కాని అనూహ్యంగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

కేంద్రం అన్‌ లాక్‌ అన్నా కూడా ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్‌ కాలేదు.ఎట్టకేలకు కొన్ని మల్టీప్లెక్స్‌లను ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించారు.

కాని గత 15 రోజులుగా అవి నష్టాల్లోనే నడుస్తున్నాయి.థియేటర్లు ఓపెన్‌ చేసినా కూడా అదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే అంతా అదే ఆందోళనతో ఉన్నారు.

అందుకే థియేటర్ల ఓపెన్‌ విషయమై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నారు.

నవంబర్‌ లో పరిస్థితి కాస్త అయినా కుదుట పడుతుందేమో అనుకుంటే మళ్లీ అదే పరిస్థితి.

ఈ నెలలో కూడా కొత్త సినిమాలు ఒక్కటి అంటే ఒక్కటి కూడా విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు.ఇదే సమయంలో డిసెంబర్‌ లో విడుదల కాబోతున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.కాని పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతికి కూడా సినిమాలు వచ్చేది నమ్మకం తక్కువే అనిపిస్తుంది.

ఎందుకంటే వ్యాక్సిన్‌ అప్పటి వరకు వచ్చినా కూడా అందరికి అందుబాటులోకి రావడంకు వచ్చే ఏడాది అంతా కూడా పట్టే అవకాశం ఉంది అంటున్నారు.థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించడం విషయం పక్కన పెడితే అసలు ఓపెన్‌ చేయడం కూడా కష్టంగా మారింది.

సినిమా థియేటర్లను సంక్రాంతి వరకు ఓపెన్‌ చేసే అవకాశం ఉందని భావించినా అప్పటికి కూడా ప్రేక్షకులు రాకుండా ఇదే పరిస్థితిని కలిగి ఉంటే నష్టాలను భరించలేక థియేటర్లను ఫంక్షన్‌ హాల్స్‌ గా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితుల నుండి థియేటర్లు ఎప్పటికి బయట పడేనో ఇంకా క్లారిటీ లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube