కేసీఆర్ చేసిన ప‌ని రేవంత్‌కు కలిసి వ‌స్తోందా..?

తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై ఎన్నో ర‌కాల ట్విస్టులు నెల‌కొంటున్నాయి.ఇప్ప‌టికే అభ్య‌ర్థులుగా ఉంటార‌నుకున్న‌వారు ప‌క్క‌కు పోవ‌డం, అస‌లు ఉనికిలో లేని వారు పేర్లు తెర‌మీద‌కు రావ‌డంతో అంతా గంద‌ర‌గోళంగా త‌యారైంది.

 Is The Work Done By Kcr Coming Together With Revanth ..?, Revanth, Kcr , Ts Polt-TeluguStop.com

ఇక‌పోతే కేసీఆర్ ఈ ఎన్నిక‌ల‌ను ఎంత సీరియ‌స్‌గా తీసుకుంటున్నారో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.ఇందులో గెలిచేందుకు ఏకంగా ద‌ళిత‌బంధు లాంటి స్కీమ్ తీసుకువ‌స్తున్నారంటేనే అర్థ‌మ‌వుతోంది.

ఇక బీజేపీ త‌ర‌ఫున ఈట‌ల రాజేంద‌ర్ కూడా గ‌ట్టిగానే పోరాడుతున్నారు.

అయితే ఈ రెండు పార్టీల వ‌ర‌కు బాగానే ఉన్నా తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌టువంటి కాంగ్రెస్‌లో మాత్రం చ‌ల‌నం లేకుండా ఉంది.

కాంగ్రెస్ పార్టీకి అస‌లు అభ్యర్థి కూడా దొర‌క‌ట్లేదు.మొద‌టి నుంచి అభ్య‌ర్థిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ ఎస్‌లో జాయిన్ కావ‌డంతో ఇక్క‌డ ఎవ‌రిని దింపాలో కూడా కాంగ్రెస్ కు అర్థం కావ‌ట్లేదు.

అయితే ఇక్క‌డ మ‌రో అంశం చర్చనీయాంశంగా మారింది.అదంటంటే కాంగ్రెస్ నేత‌లు కావాలనే జాప్యం చేస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.ఇక ఈ త‌రుణంలోనే కేసీఆర్ చేసిన ఓ ప‌ని రేవంత్‌కు క‌లిసి వ‌స్తోంది.

Telugu Delhi, Koushik Reddy, Naredra Modi, Revanth, Trs, Ts Cogress, Ts Poltics-

అదేంటంటే కేసీఆర్ రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిశారు.ఆయ‌న అలా క‌లిసిన త‌ర్వాతే ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఈ ఉప ఎన్నిక‌ను ఇప్ప‌ట్లో నిర్వ‌హించే అవ‌కాశం లేన‌ట్టు తెలిపింది.అయితే ఈ ప‌ని ఇప్పుడు రేవంత్‌కు క‌లిసి వ‌స్తోంది.

ఉప ఎన్నిక ఎలాగో మరికొన్ని నెలల తరువాతే ఉంటుంది కాబ‌ట్టి ఆ లోగా రేవంత్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడితే ఆయ‌న ఇమేజ్ పెరుగుతుంది.ఆ లోగా ఎవ‌రినో ఒక సీనియ‌ర్‌ను కూడా బ‌రిలోకి దింపేందుకు ఒప్పించ‌వ‌చ్చ‌ని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.

ఇలా రెండు ర‌కాలుగా రేవంత్‌కు క‌లిసి వ‌స్తోంద‌న్న‌మాట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube