ఈటెలను ఒంటరి చేయడమే మంత్రి గంగుల అంతిమ లక్ష్యమా?

తెలంగాణలో రాజకీయ వ్యవహారం రంజుగా మారిందని చెప్పవచ్చు.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేసాడని సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో కేసీఆర్ ఆ లేఖకు స్పందించిన కేసీఆర్ తక్షణ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

 Is The Ultimate Goal Of Minister Gangula To Isolate The Etela-TeluguStop.com

వెంటనే మంత్రి పదవి నుండి కూడా భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత ఈటెలకు కేసీఆర్ కు మధ్య మరింత గ్యాప్ పెరిగింది.

ఆ తరువాత రోజు కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూ రాజకీయాల్ని హీటెక్కించాడు.అయితే హుజురాబాద్ నియోజకవర్గం నుండి గత 20 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ హుజురాబాద్ అంటే ఈటెల, ఈటెల అంటేనే హుజురాబాద్ అన్నట్లుగా తయారయింది.

 Is The Ultimate Goal Of Minister Gangula To Isolate The Etela-ఈటెలను ఒంటరి చేయడమే మంత్రి గంగుల అంతిమ లక్ష్యమా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈటెలకు, గంగులకు మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఉందనేది నిర్వివాద అంశం.అయితే ఇప్పుడు ఈటెల తెరాస కు దూరం కావడంతో హుజురాబాద్ లో కూడా పార్టీ క్యాడర్ ను చెక్కు చెదరనీయకుండా ఈటెల వైపు వెళ్లకుండా వరుస సమావేశాలు నిర్వహిస్తూ హుజురాబాద్ లో ఈటెలను ఒంటరి చేయడమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకొని పావులు కదుపుతున్నారు.

అయితే తాజాగా ఈటెల క్యాడర్ తో కూడా సమావేశమైన మంత్రి గంగుల భవిష్యత్తులో అందరికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

#@CM_KCR #IllegalLand #IsolateEtela #Eetela Rajendar #MinsiterGangula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు