గాడ్ ఫాదర్ తో ఇక రీమేక్ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా.. అదే కారణమా?

టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ కుర్ర హీరోలకే సవాల్ విసురుతున్నాడు.అయితే చిరు చేసే సినిమాలు వరుసగా రీమేక్ సినిమాలే కావడం ఈయనకు మైనస్ అవుతుంది.

 Is The Remake Chapter Closed With Godfather Is That The Reason, Mohan Raja , God-TeluguStop.com

ప్రెసెంట్ చిరంజీవి తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

మాములుగా అయితే లూసిఫర్ సినిమా డబ్బింగ్ చిత్రంగా మన తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.కానీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు.అయితే ఎప్పుడైతే మెగాస్టార్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారో అప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో ఈ సినిమాను చూడడం మొదలు పెట్టారు.ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూసిన వారు కూడా ఉన్నారు.

దీంతో ఇప్పుడు మెగాస్టార్ తీసే గాడ్ ఫాదర్ సినిమాకు ఎక్కువ హోప్స్ లేవు.

ఎలాగైనా మెగాస్టార్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అయితే భారీగానే వస్తాయి కానీ ఈ సినిమా డైరెక్ట్ సినిమా కాకపోవడం.

అందులోను ప్రేక్షకులు ఓటిటి ద్వారా సినిమాను చూడడంతో కథ రివీల్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై అన్ని అంచనాలు పెట్టుకోలేదు.గాడ్ ఫాదర్ ప్రొమోషన్స్ వల్ల మెగాస్టార్ లుక్ వల్ల సినిమాపై అంచనాలు అయితే ఏర్పడ్డాయి కానీ సినిమాకు రావాల్సిన స్పందన మాత్రం రాలేదు అనే టాక్ నడుస్తుంది.

Telugu Chiranjeevi, Godfather, Mohan Raja, Tollywood-Movie

ఎందుకు అని ప్రశ్న వస్తే.ఇది రీమేక్ కావడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.గతంలో రీమేక్ చేస్తున్న అంచనాలు బాగా ఉండేవి.కానీ ఇప్పుడు ఓటిటి రావడంతో అన్ని సినిమాలు చూస్తుండడం వల్ల ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి పోతుంది.మరి మెగాస్టార్ చేస్తున్న సినిమాకే ఇలా ఉంటే ఇక మాములు హీరోలు రీమేక్ సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం.మరి దీనంతటికి కారణం ఓటిటిలు రావడమే అంటున్నారు.

అందుకే మెగాస్టార్ చేస్తున్న రీమేక్ సినిమానే చివరిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube