ఆ కేంద్ర మాజీ మంత్రికి రాజ్య‌స‌భ సీటు ఖాయ‌మేనా.. జ‌గ‌న్ హామీ ఇచ్చారా..?

ఏపీలో మళ్లీ ప‌ద‌వుల జాత‌ర అనేది క‌నిపంచ‌బోతోంది.ఎక్కువ సీట్లు లేక‌పోయినా కూడా.

 Is The Rajya Sabha Seat Guaranteed To The Former Union Minister Did Jagan Guarantee , Kruparani, Jagan-TeluguStop.com

ఉన్న దాంట్లో అయినా గ‌ట్టిగానే పోటీ క‌నిపిస్తోంది.ఎందు కంటే ఈ సీట్లు కొంచెం పెద్ద స్థాయి ఉన్న‌వి కాబ‌ట్టి.

అదే నండి రాజ్య‌స‌భ సీట్లు.త్వ‌ర‌లోనే ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

 Is The Rajya Sabha Seat Guaranteed To The Former Union Minister Did Jagan Guarantee , Kruparani, Jagan-ఆ కేంద్ర మాజీ మంత్రికి రాజ్య‌స‌భ సీటు ఖాయ‌మేనా.. జ‌గ‌న్ హామీ ఇచ్చారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇవ‌న్నీ వైసీపీ ఖాతాలో ఏమీ లేవు.కేవ‌లం ఒక‌టి మాత్ర‌మే వైసీపీ ఖాతాలో ఉంది.

అందులో విజ‌య‌సాయి రెడ్డి కూడా ఉన్నారు.కాగా ఈ సారి మాత్రం నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలోనే ప‌డే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే అసెంబ్లీలో ఎక్కువ మెజార్టీ సీట్లు వైసీపీకే ఉన్నాయి.

దీంతో ఈ సీట్ల మీద వైసీపీలో రాయ‌బారాలు మొద‌లైపోయాయి.

చాలా మంది వీటికి పోటీ ప‌డుతున్నారు.గ‌త ఎన్నిక‌ల్లో అవ‌కాశం రాని వారు, జ‌గ‌న్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా.

నెర‌వేరని వారు… ఇలా చాలామంది రాజ్యసభ సీట్ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా రంగంలోకి దిగిపోయారు.

ఆమెకు జ‌గ‌న్ హామీ ఉంద‌నే ప్ర‌చారం బ‌లంగానే సాగుతోంది.పైగా ఆమె కేంద్ర‌ మంత్రిగా కూడా ప‌నిచేశారు.

ఆ ప‌రిచ‌యాలు, అనుభ‌వాలు జ‌గ‌న్‌కు ఉప‌యోగ ప‌డే ఛాన్స్ లేక‌పోలేదు.

కాగా ఈమ‌కు పోటీగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేరు కూడా బ‌లంగానే వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా కూడా.ఆమెను రాజీనామా చేయించి మ‌రీ.

రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని, ఆమె సీట్లో కొడుక్కు అవ‌కాశం ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.కానీ కృపారాణి అనుచ‌రులు మాత్రం ఆమెకే అవ‌కాశం ఇస్తార‌ని కావాల‌నే రెడ్డి శాంతి పేరు తెర‌మీద‌కు తెస్తున్నార‌ని అంటున్నారు.

మ‌రి జ‌గ‌న్ మ‌న‌సులో మాత్రం ఏం వ్యూహం ఉందో తెలియాలంటే కొంచెం టైమ్ ప‌ట్టేలా ఉంది.ఇరువురికి జ‌గ‌న్ హామీ ఎలాగూ ఉంది.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Is The Rajya Sabha Seat Guaranteed To The Former Union Minister Did Jagan Guarantee , Kruparani, Jagan - Telugu Rajyasabha, Jagan, Kruparani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube