వైరల్: బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందా..?! పందికి పాలు పట్టిన ఆవు..!

భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే బ్రహ్మంగారు చెప్పారు.వాటన్నింటిని తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు.

 Is The Prophecy Of Brahman True Cow Milking A Pig-TeluguStop.com

ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు.ఇప్పుడు సమాజంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతున్నాయి.

ఎప్పుడూ ఎక్కడో ఓ చోట ఏదో రకంగా వింత ఘటన అనేది వార్తల్లో నిలుస్తూ ఉంది.తాజాగా అలాంటి వింత ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌ లో జరిగింది.

 Is The Prophecy Of Brahman True Cow Milking A Pig-వైరల్: బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందా.. పందికి పాలు పట్టిన ఆవు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Andhra Pradesh, Cow Milk, Drinks, Pig, Prakasham, Social Meida, Viral Latest, Viral Video-Latest News - Telugu

ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లాలో ఒక ఆవు పంది పిల్లలకు పాలు ఇచ్చింది.ఆవు దగ్గరికి వచ్చి పంది పిల్లలు పాలు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ఘటన చాలా వింతగా ఉంది.దీనిని చూసిన స్థానికులు, ప్రయాణికులు అవాక్కయ్యారు.ఆశ్చర్యంతో షాక్ అయ్యారు.ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణ బస్టాండ్ ప్రాంతంలో ఎప్పుడూ ఆవులు తిరుగుతూ ఉంటాయి.

ఆ ఆవులు రాత్రి పూట ఆ బస్టాండు ఆవరణలోనే ఉంటాయి.ఆకులు, పేపర్లు తింటూ జీవనం సాగిస్తుంటాయి.

అయితే అక్కడే ఖాళీ ప్రదేశంలో అవి సేదతీరుతూ ఉంటాయి.

బస్టాండుకు సమీపంలో ఆవులతో పాటు పందులు కూడా తిరుగుతుంటాయి.

అలా ఒకేసారి ఆవులు, పందులు కలిసి సేదతీరుతుంటాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఆవు నిద్రపోతుండగా పంది పిల్లలు ఆ ఆవు దగ్గరికి వచ్చాయి.

ఆ టైంలో ఆవులను చూసి ఆ పంది పిల్లలు విచిత్రంగా ప్రవర్తించాయి.పడుకుని సేద తీరున్నట్టువంటి ఆవు పొదుగు దగ్గరికి వెళ్లి పంది పిల్లలు చేరడమే కాదు ఎంచెక్కా ఆవు పాలను తాగాయి.

ఈ విషయాన్ని స్థానికులు గమనించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.వెంటనే వారు పంది పిల్లలు పాలు తాగుతున్న విషయాన్ని వీడియోలు తీశారు.

ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.చూసిన వారంతా బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందని ఆశ్చర్యపోయారు.

#Cow Milk #Prakasham #Meida #Drinks #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు