అతి త్వరలో ఐఫోన్ల ధరలకు రెక్కలు రానున్నాయి ..!

మార్కెట్ లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు ఆ టాపిక్ ఏ ట్రెండింగ్ అవుతుంది.ఏ ఫోన్ వచ్చింది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధర అనుకూలంగాలే ఉందా ఇలా ఎన్నో ప్రశ్నలు కొంతమందిని బాగా ఎక్సైట్ చేస్తుంటాయి.

 Is The Prices Of Apple Iphones Are Going To Increase Again, Iphone, Rates, Apple-TeluguStop.com

వచ్చిన ఫోన్ మంచి బ్రాండ్ అయితే ఎప్పుడెప్పుడు కొందామా అనుకునేలా ఉంటాయి.అయితే.

, కొన్ని ఫోన్స్ కొనేవారికి షాక్ ఇస్తుంటాయి.ఆ ఫోన్ ధరలకి రెక్కలు వస్తాయి.

దీంతో వచ్చిన వారు నిరాశతో వెనుతిరుగుతారు.ఇప్పుడు ఐఫోన్ కొనాలి అనుకునే వారి పరిస్థితి కూడా అలానే ఉంది.

ఐఫోన్ ధరలు ఆకాశానాన్ని అంటనున్నాయి.ఎందుకో తెలుసుకుందాం.

కొన్నేళ్లుగా యాపిల్ ఫోన్ లు మంచి స్పెసిఫికేషన్స్, మంచి ఫీచర్స్ తో సరసమైన ధరకే అమ్మేవారు.ధర కూడా తక్కువగానే ఉండడంతో యూజర్ల సంఖ్య పెరిగేది.తరువాత వచ్చిన ఐఫోన్స్ లో కూడా పెర్ఫార్మన్స్ విషయంలో ఎక్కడ తగ్గకుండా మంచి స్పెసిఫికేషన్స్ తో యూజర్లకు తక్కువ ధరకే అందిస్తూ వచ్చింది.దీంతో యూజర్స్ ఐఫోన్ కొనడానికి ముందుకు వచ్చేవారు.

గత ఏడాది యాపిల్ iphone 12 mini ఫోన్ ని తక్కువ ధరకే ముందుకు తీసుకొచ్చింది.ఐఫోన్ తమ టాప్ ప్రోడక్ట్ లపై చీపర్ వర్షన్ లను ఆఫర్ చేస్తోంది.

అయితే ఇప్పుడు చిప్ ధరలు పెరగనున్నాయి.దీంతో రాబోయే రోజుల్లో ఐఫోన్ ధరలు అమాంతంగా పెరగనున్నాయి.

Telugu Apple Iphone, Iphone, Iphone Cost, Rates, Ups, Tsmcincreases, Latest-Gene

గత నెలలో టిఎస్ఎంసి సెమికండక్టర్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది.అది కూడా ఏకంగా 20% పెంచనుంది.చిప్ కండక్టర్ ధరలు పెరగడంతో ఈ ఎఫెక్ట్ స్మార్ట్ ఫోన్ లపై పడనుంది.దీంతో స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నాయి.నెక్స్ట్ వచ్చే ఐఫోన్ ధరలు కూడా భారీగా పెరగవచ్చని నివేదిక వెల్లడించింది.ధరల పెరుగుదల అధికారికంగా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

చిప్ మేకర్స్ తో చర్చలు జరుగుతున్నాయి.దీంతో వచ్చే ఏడాది రాబోయే ఐఫోన్ లపై ఈ చిప్ ల పెంపు ప్రభావం పడదని అంటున్నారు.

కాబట్టి ముందుముందు రాబోయే ఐఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube