అసలు కృష్ణ పదార్థం అనేది ఈ సృష్టిలో వుందా?

ఈ ఖగోళంలో మానవ వేధస్సుకి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగివున్నాయి.అందులో ప్రధానమైనది కృష్ణ పదార్ధం.

 Is The Original Dark Matter In This Creation , Krishna, Viral Latest, News Vira-TeluguStop.com

అవును.దీనిని ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు.

కానీ ఈ విశ్వంలోని పదార్థంలో 85% అదే నిండి వున్నదని శాస్త్రవేత్తలు చెప్పడం విశేషం.కృష్ణ పదార్థంను ఇంగ్లీష్ లో డార్క్‌ మ్యాటర్‌ అని అంటారు.

అయితే అది ఏమిటన్నది కచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు.కానీ శాస్త్రవేత్తలు దీన్ని శోధించటం మాత్రం ఆపలేదు.

గత కొన్ని శతాబ్దాలుగా దానిపైన శోధన చేస్తూనే వున్నారు.

ఈ క్రమంలోనే అతిపెద్ద, అధునాతన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సైతం దీన్ని గుర్తించే పనిలో పడింది.

అవును.ఇది ఫెన్స్‌ క్వింటెట్‌ ఒకదానిని గుర్తించింది.

అంటే ఐదు నక్షత్ర మండలాల సముదాయం అన్నమాట.మనం మునుపెన్నడూ చూడని దీన్ని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తొలిసారిగా స్పష్టంగా చిత్రీకరించింది.

తొలిసారి పంపించిన చిత్రాల్లో భాగంగా దీని ఫొటోలనూ అందించింది.వీటిని చూశాక ఖగోళ శాస్త్రవేత్తలు ‘మనకు తెలియనిది ఏదో నిజంగానే ఉంది’ అని గట్టిగా అభిప్రాయపడుతున్నారు మన శాస్త్రవేత్తలు.

Telugu Fence Quintet, Krishna, Originaldark, Space, Latest-Latest News - Telugu

ఆ రహస్యమయ అంశాల్లో ఒకటి కృష్ణ పదార్థం ఒకటి కావొచ్చని భావిస్తున్నారు.ఒకరకంగా దీన్ని యాదృచ్ఛిక ఆవిష్కరణ అనే అనుకోవచ్చు.లార్డ్‌ కెల్విన్‌ అనే భౌతిక శాస్త్రవేత్త 19వ శతాబ్దంలో మన నక్షత్ర మండలమైన పాలపుంత ద్రవ్యరాశిని అంచనా వేయాలని అనుకున్నారు.

నక్షత్ర మండలం అంతర్భాగం చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్న వేగానికి సంబంధించిన సమాచారాన్ని దీనికి ఆధారంగా ఎంచుకున్నారు.అయితే ఈ సమాచారంలో ఏవో లోపాలున్నట్టు అనిపించింది.అవేంటని వర్ణించలేకపోవటం, వాటిని చూడలేకపోవటం వల్ల ‘చీకటి వస్తువులు’గా పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube