కేడీ సినిమాలో మమతా మోహన్ దాస్ నటించడానికి నాగార్జునే కారణమా?

Is The Nagarjuna Reason Behind Mamata Mohandas Role In Kd Movie

2010లో డైరెక్టర్ కిరణ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా ‘కేడి’.సినిమాలో అక్కినేని నాగార్జున, మమతా మోహన్ దాస్ నటీనటులుగా నటించారు.

 Is The Nagarjuna Reason Behind Mamata Mohandas Role In Kd Movie-TeluguStop.com

కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు.ఇందులో సాయాజీ షిండే, హర్షవర్ధన్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ నటించడానికి నాగార్జున కారణమని తెలుస్తుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మమతా మోహన్ దాస్ తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Is The Nagarjuna Reason Behind Mamata Mohandas Role In Kd Movie-కేడీ సినిమాలో మమతా మోహన్ దాస్ నటించడానికి నాగార్జునే కారణమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.ఆ తర్వాత కృష్ణార్జున, హోమం, చింతకాయల రవి, కేడి వంటి పలు సినిమాలలో నటించింది.

మమతా మోహన్ దాస్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ లను పాడింది.

కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ సినిమాలలో కూడా నటించింది.ఇదిలా ఉంటే ఈమె కేడి సినిమాలో నటించడానికి నాగార్జున కారణమని తెలిసింది.

సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ చాలామంది నటీనటులను కూడా మెప్పించింది.ఇక నాగార్జునను కూడా మెప్పించింది.

దీంతో ఈమె కింగ్  సినిమాలో నటించినప్పుడు ఈమె నటన పరంగా, వ్యక్తిత్వంగా నాగార్జున ను బాగా ఆకట్టుకుంది.అలా నాగార్జున కూడా చాలా సందర్భాలలో మమతా మోహన్ దాస్ గురించి తెలిపాడు.

Telugu Mamta Mohandas, Kd, Laal Bagh, Mamata Mohandas, Mamta Mohan Das, Nagarjuna, Nagarjunamamta, Tolywood-Movie

తాను కింగ్ సినిమాలో నటించిన సమయంలో మమతా మోహన్ దాస్ ను బాగా పరిశీలించానని తెలిపాడు.అంతేకాకుండా ఆమె ఎంతో ఇన్వాల్వ్ మెంట్ తో పనిచేస్తుందని, ఆమె పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.దాంతో తనకు కేడి సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడట నాగార్జున.

అలా మమతా మోహన్ దాస్ మరోసారి నాగార్జున సరసన నటించి.అతడి మనసుని గెలుచుకుంది.ఈ సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.ఇక కొంతకాలం తర్వాత దాదాపు పదకొండు ఏళ్ల వరకు సినిమాలకు దూరంగా ఉంది.

Telugu Mamta Mohandas, Kd, Laal Bagh, Mamata Mohandas, Mamta Mohan Das, Nagarjuna, Nagarjunamamta, Tolywood-Movie

ఇక ప్రస్తుతం మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈమె ఈ ఏడాది లాల్ బాగ్ అనే సినిమాలో నటించగా.ఈ సినిమా ఐటీ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ జానర్ లో రూపొందింది.

ఈ సినిమాకు ప్రశాంత్ మురళి దర్శకత్వం వహించాడు.అంతేకాకుండా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#Nagarjuna #Laal Bagh #KD #NagarjunaMamta #Mamta Mohan Das

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube