కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఇప్పట్లో లేనట్టేనా ?

కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు పనుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు.దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే.

 Is The Kcr National Party Statement Now Non Existent , Kcr, Telangana Cm, Trs, Brs, Kcr New Party, Bjp, Congress, Kcr National Party,-TeluguStop.com

బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం గా జాతీయ పార్టీని ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ తగ్గిందని , కాబట్టి ఇదే సరైన సమయంగా కొత్త పార్టీ ప్రకటించేందుకు కేసీఆర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు .మరికొద్ది రోజుల్లోనే కొత్త పార్టీ పేరును కెసిఆర్ అధికారికంగా ప్రకటిస్తారని అంతా భావిస్తుండగా.ఇప్పుడు ఆ ప్రకటన మరికొన్ని నెలల పాటు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం కేసీఆర్ సతీమణి ఆస్పత్రిలో చేరారు.

 Is The KCR National Party Statement Now Non Existent , Kcr, Telangana Cm, Trs, Brs, Kcr New Party, Bjp, Congress, Kcr National Party, -కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఇప్పట్లో లేనట్టేనా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మోకీలు ఆపరేషన్ చేయించుకున్నారు.

ఇంతే కాకుండా జాతీయ పార్టీ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఇంకా చక్కబడలేదు.ఇవన్నీ పూర్తయ్యే సరికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే ఈనెల 30వ తేదీ నుంచి షడం నెల ప్రారంభం కాబోతోంది.అసలే కేసీఆర్ కు సెంటిమెంట్స్ ఎక్కువ.

మంచి రోజులు, ముహూర్తాలు బాగా నమ్ముతారు.ఈ నేపథ్యంలో ఆషాడం తర్వాత జాతీయ పార్టీకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది.

Telugu Congress, Kcr National, Kcr, Telangana Cm-Politics

అలాగే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడమా లేక విడిగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయడమా అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ రాలేదు.దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన హడావిడి నడుస్తుండటంతో, ఈ అన్ని వ్యవహారాలు సద్దుమణిగిన తరువాత మాత్రమే సరైన రాజకీయ అనుకూలత చూసుకుని కొత్త జాతీయ పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు టిఆర్ఎస్ లోని కొంతమంది నాయకులు చెబుతున్నారు.అయితే ఈ విషయంలో కేసీఆర్ సైలెంట్ గానే ఉన్నారు.చాపకింద నీరులా పనులు చక్కబెడుతూ జాతీయ పార్టీ ఏర్పాటు పనుల్లో బిజీగా కేసీఆర్ ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube