కృష్ణా టీడీపీలో ఈ నేత‌ల శ‌కం ముగిసిందా..?

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, అన్న‌గారు ఎన్టీఆర్ పుట్టిన కృష్ణాజిల్లాలో పార్టీకి సీనియ‌ర్లు దూర‌మ‌వుతున్నారు.దాదాపు మూ డు ద‌శాబ్దాలుగా రాష్ట్ర, జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించిన సీనియ‌ర్లు.

 Is The Era Of These Leaders In Krishna Tdp Over, Tdp,ap,ap Political News,andhra-TeluguStop.com

వ‌యో వృద్ధులు కావ‌డం, అనారోగ్య స‌మ‌స్య‌లతో పార్టీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది.గ‌త ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రు పోటీ చేసినా.

గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు.అయితే.

వీరంతా రాజ‌కీయాల్లో త‌మదైన పాత్ర పోషించారు.అవినీతి మ‌చ్చ‌లేని నేత‌లుగా గుర్తింపు పొందారు.

అయితే.మారుతున్న కాలానికి అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోలేక పోవ‌డం, వ‌య‌సు సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌డంతో వీరు టీడీపీకి దూర‌మ‌వుతున్నారు.

ఇలాంటివారిలో కృష్ణాజిల్లాకు చెందిన కాగిత వెంక‌ట్రావు, మాజీ డిప్యూటీ స్పీక‌ర్‌ మండలి బుద్ధ ప్ర‌సాద్, మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కాగిత వెంక‌ట్రావు కుమారుడు పెడ‌న నుంచి పోటీ చేసినా ఓడిపోయారు.

ఇక‌, మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి కొన‌క‌ళ్ల పోటీ చేసి ప‌రాజ యం పాల‌య్యారు.ఇక‌, మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీ నుంచి త‌ప్పుకొనేందుకు రెడీఅ యినా.

చంద్ర‌బాబు ఒత్తిడి తో అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేశారు.అయితే, వైసీపీ దూకుడు ముందు ఆయ‌న కూడా ఓడిపోయారు.

Telugu Andhra Pradesh, Ap, Buddha Prasad, Chandra Babu, Jallil Khan, Krishna, Wa

ఇక‌, జ‌లీల్ ఖాన్ గ‌త ఎన్ని క‌ల్లోనే చేతులు ఎత్తేసి.త‌న కుమార్తె ఖ‌తూన్‌ను రంగంలోకి దింపారు.అయితే.ఆమె కూడా ఓడిపోయారు.ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరు ఎవ‌రూ కూడా పోటీలో ఉండే ప‌రిస్థితి లేకుండా పోయింది.ఎన్నిక‌ల‌కు మూడేళ్ల స‌మ‌యం ఉండ‌డం, ప్ర‌స్తుతం ఈ సీనియ‌ర్లు వివిధ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడుతుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

కొన‌క‌ళ్ల నారాయ‌ణ త‌న‌కుమారుడికి పెడ‌న లేదా మచిలీప‌ట్నం టికెట్‌ను ఆశిస్తున్నారు.

అయితే.

పెడ‌న‌లో కాగిత వెంక‌ట్రావు కుమారుడు ఉండ‌డం, మ‌చిలీప‌ట్నంలో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఉండ‌డంతో కొన‌క‌ళ్ల డోలాయ‌మానంలో ప‌డ్డారు.అయితే, ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది.

అవ‌నిగ‌డ్డ నుంచి మండ‌లి కుమారుడు పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమలో మాత్రం ఈ ద‌ఫా జలీల్ కుటుంబానికి ఛాన్స్ ద‌క్క‌క పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.

మ‌రి ఇక్క‌డ ఎవ‌రు అవ‌కాశం ద‌క్కించుకుంటారో చూడాలి.ఏదేమైనా.

కృష్ణాలో సీనియ‌ర్లు పార్టీకి దూర‌మ‌వ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.>

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube