ప్రతి రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు రకరకాల హామీలను ప్రజలకు ఇస్తూ ఉంటారు.ఇది చాలా సర్వసాధారణమైన విషయం.
అయితే అది ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసిన పార్టీ ఒక్కటి కూడా ఉండదు.దానికి రకరకాల కారణాలు ఉంటాయి.
ప్రస్తుతానికి ఇది అప్రస్తుతమైన అంశం.అయితే ఇలా అన్ని రాష్ట్రాలలో అయితే చాలా సర్వసాధారణమైన విషయం అనుకోవచ్చు.
కాని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ఇలా చేయాలని ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించినా ప్రజల నుండి ఏదో ఒక రోజు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రజలకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి.
వారి ఆశలను నెరవేర్చాలంటే ప్రభుత్వం చాలా ఆచితూచి హామీలు ఇవ్వవలిసి ఉంటుంది.ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాలనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు కాబట్టి.
అయితే కెసీఆర్ కూడా చాలా రకాల హామీలు తాను పాల్గొన్న సభలలో అక్కడి ప్రజలను సంతృప్తి పరచడం కోసం హామీలు ఇవ్వడం తరువాత వాటి అమలుపై, పురోగతిపై ప్రజలకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత రావటం లేని పక్షంలో కెసీఆర్ మాటలపై ప్రజలకు మెల్ల మెల్లగా నమ్మకం సదాలుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.అయితే ప్రతిపక్షాలు కెసీఆర్ మాటలను, హామీలను అస్త్రంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.
అయితే ప్రజలకు నాయకుని మాటల మీద నమ్మకం పోతే ఇక రాజకీయంగా సదరు నాయకునికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.అయితే కెసీఆర్ ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ ను అర్ధం చేసుకొని ఎంతో కొంత హామీలను నెరవేర్చే ప్రయత్నం చేసినా ఎంతో కొంత వ్యతిరేక వాతావరణాన్ని తగ్గింకుకునేందుకు ఆస్కారం ఉంటుంది.