విశాఖ తీరం త‌రిగిపోతోందా.. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే..?

స‌ముద్రం ఎంత ఆహ్లాద‌క‌రంగా ఉంటుందో అంతే ప్రమాద‌క‌రం కూడా.తీర ప్రాంతంలో ఉంటే ఆనందం వేరే లెవ‌ల్ లో ఉంటుంది క‌దా.

 Is The Coast Of Visakhapatnam Declining What Are The Scientists Saying  Visakhap-TeluguStop.com

అయితే ఇప్పుడు తీర ప్రాంతానికి సంబంధించిన ఓ విచిత్ర‌మైన వార్త‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం.అది కూడా ఏపీలోని విశాఖ తీర ప్రాంతానికి సంబంధించింది.

నిజానికి విశాఖ తీరం 50 ఏళ్ల క్రితం చాలా దూరంలో ఉండేద‌ట‌.అప్పుడు స‌ముద్రం చాలా దూరంగా ఉండేద‌ని నిపుణులు చెబుతున్నారు.

అంతెందుకు ఇప్పుడు అక్క‌డ ఉన్న మత్స్యకారులు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు.

అప్ప‌టికి ఇప్ప‌టికి స‌ముద్రం చాలా ముందుకు వ‌చ్చింద‌ని వివ‌రిస్తున్నారు.

తాము ఆడుకున్న ఆటస్థలం స‌ముద్రం ముందుకు రావ‌డంతో అది మునిగిపోయి ఇప్పుడు కేవ‌లం రోడ్డు మాత్రమే ఉంద‌ని తెలియ‌జేస్తున్నారు.నిజానికి విశాఖ ప‌ట్నంలో హార్బర్ ప్రాంతం నుంచి మొద‌లు కొంటే భీమిలి ప‌ట్ట‌ణం దాకా దాదాపుగా 32 కి.మీ.తీరం నిక్షిప్ల‌మై ఉంది.ఇక్కడ విచిత్రం ఏంటంటే పెదజాలారిపేట తో పాటుగా జోడుగుళ్లపాలెం అలాగే సాగరనగర్, తో పాటుగా భీమిలి ప‌ట్ట‌ణాల్లో ఉన్న‌టువంటి తీరం నిత్యం ముందుకు వ‌స్తోంద‌ని చెబుతున్నారు అక్క‌డి స్థానికులు.

Telugu Andrapradesh, Bhimili, Sinitst, Visakhapatnam-Latest News - Telugu

తీర ప్రాంతం చాలా వ‌ర‌కు త‌గ్గిపోతోంద‌ని స‌ముద్రం త‌న‌లో క‌లిపేసుకుంటోంద‌ని చెబుతున్నారు.ఇప్ప‌టి దాకా దాదాపు 80 ఏండ్ల‌లో మ‌న దేశంలోని 12 తీర ప్రాంత నగరాలు స‌ముద్రంలో క‌లిసిపోయాయ‌ని చెబుతున్నారు నిపుణులు.సముద్ర నీటి మట్టం పెరిగే కొద్దీ విశాఖ తీర ప్రాంతం త‌గ్గిపోతుంద‌ని చెబుతున్నారు చాలామంది.ఇక రాబోయే 80 ఏండ్ల‌లో ఇండియాలోని 12 తీర ప్రాంతాలు అందులో విశాఖ‌తో క‌లిపి 0.16 మీటర్ల నుంచి 0.82 మీటర్ల దాకా తీర ప్రాంతం స‌ముద్రంలో క‌లిసిపోతుంద‌ని సైంటిస్టులు అంచ‌నా వేస్తున్నారు.అంటే రాబోయే రోజుల్లో విశాఖ తీరం మ‌రింత‌గా త‌గ్గిపోతుంద‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంద‌న్న‌మాట‌.

చూడాలి మ‌రి రానున్న కాలంలో ఏం జ‌రుగుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube