ఆ విషయంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందా..?!

కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(RC), వాహనాల చెల్లుబాటు గడువు పొడగింపు విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుందిం.ఈ క్రమంలో ఈ డాక్యుమెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి అక్టోబర్ 31వ తేదీ డెడ్ లైన్ గా ప్రకటించింది.

 Is The Center Going To Take A Key Decision On That ..?! Central Government, Key-TeluguStop.com

ఆ సమయం కనుక దాటితే మళ్ళీ ఈ గడువు పొడిగించే అవకాశమే లేదని స్పష్టంగా తెలిపింది కేంద్ర ప్రభుత్వం.నిజం చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్ల చెల్లుబాటును ఇప్పటివరకు మన కేంద్ర ప్రభుత్వం మొత్తంగా 7 సార్లు పెంచారు.

కరోనా వైరస్ కారణంగా ఈ గడువు పెంచుతూ వస్తుంది కేంద్రం.30 మార్చి 2020 మొదలుకుని 30 సెప్టెంబర్ 2021 వరకు మంత్రిత్వ శాఖ ఈ డాక్యూమెంట్స్ చెల్లుబాటును పొడిగించూ కుంటూ వస్తుంది.ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని ఈనెల 31 వరకు సమయం ఇచ్చారు.ఇందుకోసం మోటార్ వాహనాల చట్టంలో కూడా మార్పులు తీసుకుని వచ్చింది కేంద్రం.అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఎవరికయితే వాహనాల డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుండా పట్టుబడితే కనుక వారికి భారీగా జరిమానా విధించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.

Telugu Central, Key, Latest-Latest News - Telugu

కరోనా కారణంగా వాహనాలకు సంబందించిన పత్రాల గడువు ముగిసినా గాని ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటివరకు చెల్లుబాటు అయ్యేలా గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చూసి చూడనట్లు వదిలేసింది.కానీ 31 అక్టోబర్ 2021 తర్వాత మాత్రం నిబంధనలు వర్తిస్తాయని హెచ్చరిస్తుంది రవాణా శాఖ.ఒకవేళ మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, వెహికల్ పర్మిట్ రెన్యువల్ చేయాలంటే త్వరగా చేయించుకోండి.ఎందుకంటే అక్టోబర్ 31వ తేదికి కేవలం 18 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి త్వరగా రెన్యూవల్ చేయించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube