బీజేపీలోకి భారీ చేరికలంటూ ప్రచారం.. వ్యూహంలో భాగమేనా?

తెలంగాణ రాజకీయాలు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో రసవత్తరంగా మారిన పరిస్థితి ఉంది.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలలో టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కోసం ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న పరిస్థితి ఉంది.

 Is The Campaign A Huge Addition To The Bjp Is It Part Of The Strategy Trs Party,-TeluguStop.com

బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకేసి కెసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితిలలో బీజేపీవైపు టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతోంది.అంతేకాక కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సంవత్సరం ముందు బీజేపీలో చేరడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని మరో ప్రచారం సాగుతోంది.

అయితే టీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బ తీయడానికే బీజేపీ తమ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నదనే మరో వాదన బలంగా వినిపిస్తోంది.

Telugu @bandisanjay_bjp, @cm_kcr, @trspartyonline, Telangana-Political

అయితే టీఆర్ఎస్ లో పదవులు దక్కని కారణంగానే మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అయితే రాజకీయాల్లో పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తామని సరైన సమయంలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ పార్టీ అంతర్గత సమావేశాలలో ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే బీజేపీని మాత్రం తెలంగాణ సుస్థిరం కానిచ్చే పరిస్థితిని కెసీఆర్ రానిచ్చే అవకాశం లేదు.ఈ వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజకీయంగా బీజేపీని దెబ్బ కొట్టడానికి పెద్ద ఎత్తున రానున్న ఎన్నికల్లో కూడా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే బీజేపీ మాత్రం ఎంతో కొంత ప్రయత్నిస్తున్నా ఎన్నికల సమరంలో కెసీఆర్ తో పోటీ పడే అవకాశం చాలా తక్కువ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఎందుకంటే నిరుద్యోగులు అగ్రహంగా ఉన్న పరిస్థితిలో చివరి సంవత్సరంలో ఉద్యోగాలు కల్పించే అవకాశం, అయితే మునుపెన్నడూ లేని రీతిలో ఒక ప్రత్యేక ఉద్యోగ నియామక శైలితో ముందుకొచ్చే అవకాశాలు కనిపసితున్నాయి.

ఏది ఏమైనా బీజేపీ చేస్తున్న వ్యూహాలు టీఆర్ఎస్ కు లాభమా, నష్టమా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube