న‌ర్సాపురానికి ఉప ఎన్నిక త‌ప్ప‌దా.. వ‌స్తే టీడీపీ ప‌రిస్థితి ఏంటి.?

ఏపీలో మ‌రోసారి ఉప ఎన్నిక రాబోతోందా.అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

 Is The By-election Not Now For Narsapur What Is The Tdp Situation Details, Tdp, Raghurama, Ycp Rebel Mp, Raghurama Krishnam Raju, Narasapuram Constituency, Tdp Party, Ycp, Janasena, Bjp, Ap Politics-TeluguStop.com

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆక‌ర్షిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సాపురం ఎంపీ సీటు.వైసీపీ రెబ‌ల్ ఎంపీగా ర‌ఘురామ కృష్ణం రాజు త్వ‌ర‌లోనే రాజీనామా చేయ‌నున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఇక వైసీపీ కూడా ఆయ‌న త‌మ పార్టీ ఎంపీ కాద‌ని, ఆయ‌న స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలంటూ కేంద్రాన్ని కూడా కోరుతోంది.కాబ‌ట్టి స‌రైన స‌మ‌యం కోసం చూస్తున్న ర‌ఘురామ‌.

 Is The By-election Not Now For Narsapur What Is The TDP Situation Details, TDP, Raghurama, Ycp Rebel Mp, Raghurama Krishnam Raju, Narasapuram Constituency, Tdp Party, Ycp, Janasena, Bjp, Ap Politics-న‌ర్సాపురానికి ఉప ఎన్నిక త‌ప్ప‌దా.. వ‌స్తే టీడీపీ ప‌రిస్థితి ఏంటి.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారంట‌.

అయితే ఉప ఎన్నిక వ‌స్తే టీడీపీ ప‌రిస్థితి ఏంటి వైసీపీ బ‌లం ఏంటి అనేది ఒక‌సారి బేరీజు వేసుకోవాలి.

అయితే ఇక్క‌డ దాదాపు 25 ఏండ్లుగా టీడీపీ ఒక్క సారి కూడా గెల‌వ‌లేదు.అంత‌కు ముందు మాత్రం టీడీపీ నుంచి భూపతిరాజు విజయ్ కుమార్ 1984, 1989, 1991 ఎన్నికల్లో వ‌రుస‌గా గెలిచారు.

ఇక ఆయ‌న త‌ర్వాత చివ‌ర‌గా 1996లో కొత్తపల్లి సుబ్బారాయుడు బ‌రిలోకి దిగి జెండా ఎగ‌రేశారు.ఇక ఆయ‌న త‌ర్వాత మాత్రం ఇక్క‌డ టీడీపీ మ‌ళ్లీ గెల‌వ‌లేదు.ఆ త‌ర్వాత వ‌రుస‌గా కాంగ్రెస్‌, బీజేపీలు గెలుస్తూ వ‌స్తున్నాయి.ఇక చివ‌రి సారిగా వైసీపీ నుంచి ర‌ఘురామ గెలిచారు.

మ‌రి ఇప్ప‌డు ఉప ఎన్నిక వ‌స్తే మాత్రం ర‌ఘురామ జ‌న‌సేన లేదంటే బీజేపీ నుంచి బ‌రిలోకి దిగుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆలోపు ఎలాగూ చంద్ర‌బాబు పొత్తు పెట్టుకోక‌పోతే టీడీపీ నుంచి ఎవ‌రు నిలుస్తారో ఇక్క‌డ చెప్ప‌డం క‌ష్టం.ఎందుకంటే ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థి లేడు.కాబ‌ట్టి టీడీపీ ఇక్క‌డ గెలిచే ఆస్కారం లేద‌నే చెప్పుకోవ‌చ్చు.ఇక వైసీపీకి బ‌లంగా ఇక్క‌డ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబ‌ట్టి గెలిచెందుకు మంచి అవ‌కాశాలు ఉన్నాయి.మ‌రి ఇక్క‌డ ఏ పార్టీ గెలిచి నిలుస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.

Is The By-election Not Now For Narsapur What Is The TDP Situation Details, TDP, Raghurama, Ycp Rebel Mp, Raghurama Krishnam Raju, Narasapuram Constituency, Tdp Party, Ycp, Janasena, Bjp, Ap Politics - Telugu Ap, Janasena, Raghurama, Tdp, Ycp Rebel Mp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube