నల్గొండ పర్యటనతో బీజేపీ మరొక అపవాదు మూటగట్టుకున్నట్టేనా?

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పెద్ద ఎత్తున దూకుడును ప్రదర్శిస్తూ తొందరపాటు నిర్ణయాలతో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితిని ఏర్పరుచుకుంటోంది.ఈటెల ర్యాలీ సందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ రైతులందరు వరి వేయండి, ప్రభుత్వం ఎలా కొనదో మేము చూస్తాం, కెసీఆర్ మెడలు వంచైనా ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 Is The Bjp Wrapping Up Another Scandal With The Nalgonda Tour Details, Bjp Party-TeluguStop.com

అయితే ఈ వ్యాఖ్యల పట్ల కెసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించడంతో ఇక బండి సంజయ్ కానీ బీజేపీ కానీ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఉంది.ఇక ఆ ఘటనతో ఒక్కసారిగా బీజేపీకి మద్దతిచ్చిన రైతులు సైతం కాస్త వెనుకడుగు వేసిన పరిస్థితి ఉంది.

అయితే తాజాగా నల్గొండలో ఎంపీ బండి సంజయ్ పర్యటన ఎంతగా ఉద్రిక్తంగా మారిందో మనం చూశాం.వరి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలంతా అక్కడికి వెళ్ళడం, అంతేకాక రైతులపై దాడి చేయడంపై టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఒక్కసారిగా భగ్గుమన్న పరిస్థితి ఉంది.

అక్కడకు బీజేపీ నేతలు రైతులపై దాడి చేసిన మాట వాస్తవం.ఈ ఘటనతో ఒక్కసారిగా బీజేపీపై దురభిప్రాయం ఏర్పడింది.

Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bjp, Bandi Sanjay, Bandisanjay,

కానీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా రైతుల వేష ధారణలో టీఆర్ఎస్ నేతలు వచ్చి దాడి చేశారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది.అయితే ఇటు టీఆర్ఎస్, బీజేపీ పార్టీ తప్పు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా బీజేపీ నల్గొండ పర్యటన ఒక పెద్ద అపవాదును మూటగట్టుకుందని చెప్పవచ్చు.అయితే బీజేపీ చేసిన ఈ తప్పిదాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా వినియోగించుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube