ఇక కెసీఆర్ వేస్తున్న ఈ వ్యూహంతో బీజేపీ చాప్టర్ క్లోజేనా?

Is The Bjp Chapter Close With This Strategy Being Pursued By Kcr

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు పెద్ద ఎత్తున బలపడాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వరుస ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీపై కెసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది.

 Is The Bjp Chapter Close With This Strategy Being Pursued By Kcr-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడమే.

అందుకే ఇటు బీజేపీ కావచ్చు , కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.బీజేపీ రోజురోజుకు టీఆర్ఎస్ కు అడ్డంకిగా మారుతున్న తరుణంలో బీజేపీపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది.

 Is The Bjp Chapter Close With This Strategy Being Pursued By Kcr-ఇక కెసీఆర్ వేస్తున్న ఈ వ్యూహంతో బీజేపీ చాప్టర్ క్లోజేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానంతో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యంను యాసంగిలో కొనుగోలు చేయమని చెబుతున్న తరుణంలో ప్రస్తుతం రైతులకు అతి పెద్ద సమస్యగా ఈ అంశం మారింది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, Telangana-Political

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వరి ధాన్యాన్ని యాసంగిలో కొనుగోలు చేయమని ఖరాఖండీగా చెప్పిన పరిస్థితుల్లో ఇక రానున్న రోజుల్లో ఈ విషయాన్ని కెసీఆర్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే అవకాశం వంద శాతం ఉంది.అంతేకాక బీజేపీ పార్టీ వారిని రైతుల కల్లాల వద్దకు వచ్చి రాజకీయం చేయాలని చూస్తే బీజేపీ పార్టీ నాయకులను ఎక్కడిక్కడ నిలదీయాలనే వాదనను బలంగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం వంద శాతం ఉంది.ఏది ఏమైనా బీజేపీని ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కలిగించే దిశగానే కెసీఆర్ కార్యాచరణ ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరి బీజేపీ ఈ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ విధంగా ప్రజలకు సమాధానం ఇస్తుందనేది చూడాల్సి ఉంది.

#Telangana #@CM_KCR #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube