2024 ఏపీ పోటీ త్రిముఖమా? ద్విముఖమా..

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ అప్పుడే మొదలయిపోయింది.2024 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్న కానీ పోటీ మాత్రం ప్రారంభమయిపోయిందని చాలా మంది చెబుతున్నారు.ఇప్పటికే తాము పొత్తులకు అనుకూలమే అని టీడీపీ బహిరంగంగానే ఆఫర్ ఇచ్చింది.ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ చూస్తోంది.పొత్తులు లేకపోతే వైసీపీని ఓడించడం కష్టం అని టీడీపీ నేతలు భావిస్తున్నారు.వారు ఎక్కువగా పొత్తులు పెట్టుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి.

 Is The 2024 Ap Elections Three Way Tdp Ycp Janasena Details, Tdp, Ycp Janasena,-TeluguStop.com

కావున 2024 ఎన్నికల్లో ద్విముఖ పోరే మనం చూస్తామని చాలా మంది అంటున్నారు.

అలా కాకుండా జనసేన టీడీపీతో కలవకపోతే మనం త్రిముఖ పోరు చూడాల్సి వస్తుంది.2014 మాదిరిగా టీడీపీతో కలిసి పోటీ చేస్తేనే లాభం ఉంటుందని అప్పుడే జగన్ ను ఓడించడం సాధ్యపడుతుందని జనసేన నాయకులు అంటున్నారు.కానీ పొత్తుల గురించి నిర్ణయం తీసుకోవాల్సింది అధినేత కాబట్టి ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

ఇలా 2024 ఎన్నికల్లో పోరు ఎలా ఉండబోతుందని ఇప్పటి నుంచే పలువురు ఆరా తీస్తున్నారు.ఇక మరో పక్క చూసుకుంటే అధికార వైసీపీ 2024 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది.

రాష్ర్టంలోని 175 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది.

అందుకోసం ఇప్పటి నుంచే సర్వేను కూడా చేయిస్తోంది.ఈ సర్వే ప్రకారం ఎవరికి సీట్లు ఇవ్వాలో తేలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.వైసీపీ పొత్తుల జోలికి వెళ్లకుండా ఉంటే మాత్రం టీడీపీ ఎలాగైనా పొత్త పెట్టుకోవాలని చూస్తోంది.

రెండు పార్టీలతో అయినా మూడు పార్టీలతో అయినా సరే పొత్తు పెట్టుకుని అధికార వైసీపీని గద్దె దించాలని టీడీపీ పార్టీ యోచిస్తోంది.మరి టీడీపీ పార్టీ అనుకున్న విధంగా పొత్తులకు మిగతా పార్టీలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాయో? లేదో?

Who will win Andhra Pradesh Election in #APNews

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube