అందుకే ఆర్జీవితో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆగిపోయిందా...?

విభిన్న కథాంశాలతో, అలాగే నిజజీవిత కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సాహసం చేస్తూ ఉండేటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

 Is That Why Megastar Chiranjeevis Movie With Ram Gopal Varma Stopped-TeluguStop.com

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవితో “వినాలని ఉంది” అనే చిత్రాన్ని తెరక్కిస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి.అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో మెగాస్టార్ అభిమానులు పండగ చేసుకున్నారు.

కానీ అంతలోనే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు రావడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.అయితే అందుకు గల కారణాలు అప్పట్లో తెలియరాలేదు కానీ ఇప్పుడు మాత్రం నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ చిత్ర షూటింగ్ సమయంలో చిరంజీవి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కథనంలో కొంతమేర చిన్న చిన్న మార్పులు చేయాలని అడిగార.ట. దాంతో కథ విషయంలో రామ్ గోపాల్ వర్మ రాజీ పడక పోవడంతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని సమాచారం.

Telugu Chiranjeevi, Chiranjeeviram, Ram Gopal Varma, Tollywood-Movie

అయితే అంతకు ముందే ఈ చిత్రం కోసం సంబంధించి రెండు పాటలను కూడా చిత్రీకరించారని ఈ సినిమా ఆగిపోవడంతో ఆ పాటలను గుణశేఖర్ దర్శకత్వం వహించినటువంటి “చూడాలని ఉంది” చిత్రం కోసం ఉపయోగించారు.ఈ చిత్రంలో నియర్ నటి టబు హీరోయిన్ గా నటించినట్లు తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఆర్జివి కాంబినేషన్ అంటే బొమ్మ హిట్ అని ముందే చెప్పొచ్చు.

కానీ బొమ్మ పడకపోవడంతో అభిమానులు కొంతమేర నిరాశ చెందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube