జగనన్న మార్క్ రాజకీయం ఇవే !

సాధారణంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) కు అపార చాణక్యుడిగా పేరుంది.ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ.

 Is That The Politics Of Ys Jagan , Ap Politics, Tdp,ycp, Ys Jagan,chandrababu Na-TeluguStop.com

సరైన టైమ్ లో సరైన ప్రణాళికలు వేస్తూ రాజకీయ చదరంగంలో పై చేయి సాధించడంలో బాబు రూటే వేరు అని రాజకీయవాదులు చెబుతుంటారు.ఇక చంద్రబాబు తరువాత తెలంగాణ ముఖమంత్రి కే‌సి‌ఆర్( KCR ) కు ఆ స్థాయి పేరుంది.

ఇప్పుడు ఏపీ సి‌ఎం జగన్( CM Jagan ) కూడా ఆ లిస్ట్ లో చేరబోతున్నారా ? అంటే అవుననేది కొందరి అభిప్రాయం.ప్రస్తుతం జగన్ వ్యూహాలు ప్రణాళికలు అన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో విజయం కోసమే అన్నట్లుగా ఉన్నాయి.

వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ కు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త సందేహంలోకి నెట్టేసినప్పటికి.వచ్చే సాధారణ ఎన్నికల విషయంలో మాత్రం ధీమాగానే ఉన్నారు.

Telugu Ap, Chandrababu, Cm Kcr, Ys Jagan-Politics

అయితే ఎమ్మెల్సీ( Mlc ) ఫలితాలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ఈ ఎన్నికల ప్రభావం ఎంతో కొంత వచ్చే సార్వత్రిక ఎన్నికలపై చూపే అవకాశం లేకపోలేదు.ఈ నేపథ్యంలో వైసీపీపై నెలకొన్న వ్యతిరేకత నుంచి ప్రజలను దారి మళ్లించే పనిలో వైఎస్ జగన్ నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి కారణం తాజాగా అసెంబ్లీలో చేటు చేసుకున్నా పరిణామాలు అని చెప్పవచ్చు.

జగన్ సర్కార్ ప్రవేశ పెట్టిన జీవో నెంబర్ ఒన్ పై చర్చ కు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా.అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవడంతో వైసీపీ మరియు టీడీపీ ఎమ్మెల్యేల మద్య కాస్త ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

ఫలితంగా టీడీపీ ఎమ్మేల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు.దాంతో చర్చకు రావాల్సిన జీవో నెంబర్ ఒన్ అంశం పక్కదారి పట్టింది.

Telugu Ap, Chandrababu, Cm Kcr, Ys Jagan-Politics

అదే విధంగా వైసీపీపై ఉన్న వ్యతిరేకతను టీడీపి జనసేన పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి.తనను ఢీ కొట్టడానికి తోడేళ్లు ఏకమౌతున్నౌయని, తనకు అండ ప్రజా బలమే అనే సెంటిమెంట్ వ్యాఖ్యలతో వైసీపీపై ఏర్పడుతున్న వ్యతిరేకతను జగన్ తుడిచేస్తున్నారు.మంచి చేశామని భావిస్తే ఓటు వేయండని లేదంటే లేదని జగన్ చూపిస్తున్న సెంటిమెంట్ రాజకీయం కూడా ప్రజల్లో గట్టిగానే రిజిస్టర్ అవుతోంది.తద్వారా జగన్ పై వ్యతిరేకత సంగతి అలా ఉంచితే.

సింపతీ క్రియేట్ అవుతోందనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.గత ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అంటూ జగన్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం గట్టిగానే సక్సస్ అయింది.

అదే విధంగా ఈసారి కూడా ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికి జగన్ వల్లిస్తున్న సెంటిమెంట్ అస్త్రాలపై ప్రజల్లో వైసీపీపై సానుకూలత ఏర్పడే అవకాశం ఉందనేది కొందరి వాదన.ఇక ప్రతిపక్షల నోళ్ళు సరైన టైమ్ లో మూయించడం, ప్రజల్లో తనపై సింపతీ క్రియేట్ అయ్యేలా చేయడం ఇవన్ని కూడా జగన్ మార్క్ రాజకీయాలు అని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube