చిత్తూరులో చంద్ర‌బాబుకు సెగ పెడుతోంది ఆ ఒక్క‌డేనా ?

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాలు కోరుతూ. వైసీపీ చేసిన ప్ర‌చారం.

 Is That The Only One Peddireddy Ramachandra Redddy Who Is Paying Homage To Chan-TeluguStop.com

టీడీపీకి ఇబ్బందిక‌రంగా మారింది.ముఖ్యంగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో ఎక్కువ‌గా ఏక‌గ్రీవాలు జ‌రిగాయ‌ని అధికారులు చూచాయగా ప్ర‌క‌టించారు.

అయితే.వీటిని నిర్ధారించ‌రాదంటూ.

ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇది టీడీపీకి తాత్కాలిక ఉప‌శ‌మ‌నంగానే మారింది.

ఎందుకంటే.పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం ప్ర‌కారం.

ఏక‌గ్రీవాలు అమ‌ల‌వుతాయి.వీటిని అడ్డుకునే అధికారం లేదు.

అయితే.నిమ్మ‌గ‌డ్డ మాత్రం ఏక‌గ్రీవాలు జ‌రిగిన తీరును క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి ఒక నిర్ణ‌యం తీసుకుం టాన‌ని ప్ర‌క‌టించారు.కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించినా.వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని.

నిర్ణ‌యించింది.సో.మొత్తానికి చిత్తూరు ఏక‌గ్రీవాల‌ను అంగీక‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంది.అలా కాకుండా వీటిని కాదంటే.

వైసీపీ కోర్టుకువెళ్లే అవ‌కాశం కూడా ఉంది.ఈ ప‌రిణామం అటు టీడీపీకి, ఇటు నిమ్మ‌గ‌డ్డ‌కు కూడా ఇబ్బందేన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

Telugu Ap, Chandra Babu, Chittoor, Jagan, Latest, Panchayat, Peddi, War, Tdp-Tel

ఈ నేప‌థ్యంలో చిత్తూరు ఏక‌గ్రీవాలు ఓకే అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.ఇదే జ‌రిగితే.త‌న సొంత జిల్లాలోనే ఏక‌గ్రీవాలను అడ్డుకోలేక పోయార‌నే ఆవేద‌న చంద్ర‌బాబుకు త‌ప్ప‌క పోవ‌చ్చు.పైగా టీడీపీ ఇక్క‌డ పుంజుకోలేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏక‌గ్రీవాలు జ‌రిగాయి.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.

ఈ నేప‌థ్యంలోనే ఎస్ ఈసీ ఆయ‌న‌పై నిర్బంధ ఆదేశాలు ఇచ్చింది.

అయినా.

కూడా వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.పెద్దిరెడ్డి ప్ర‌క‌టించడం.

ఆయ‌న‌పై ఉన్న నిర్బంధాన్ని కోర్టు ఎత్తివేయ‌డం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో చిత్తూరు ఏక‌గ్రీవాల‌కు ఎదురు లేద‌నేవ్యాఖ్య‌లు వైసీపీలో మెండుగా వినిపిస్తున్నాయి.

ఇది అంతిమంగా చంద్ర‌బాబుకు ఇబ్బంది అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube