ఆ మంత్రి అలిగారా.. అసెంబ్లీలో జాడ‌లేని మ‌హిళా మంత్రి ?

గ‌త కొన్నాళ్లుగా పార్టీకి, పార్టీ కార్య‌క్ర‌మాలు కూడా దూరంగా ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రి గురించి వైసీపీలో హాట్ టాపిక్ చ‌ర్చ‌గా న‌డుస్తోంది.పార్టీలో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ఆమెకు జ‌గ‌న్‌.

 Is That Minister Hurted.. In Assembly No Address Of That Women Minister,ap,ap Po-TeluguStop.com

మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఆద‌రించారు.అయితే.

కొన్నాళ్లుగా జిల్లాలో ఆధిప‌త్య రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి.మ‌రో మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ దూకుడు ముందు స‌ద‌రు మ‌హిళా మంత్రి చేతులు ఎత్తేస్తున్నారు.

ఎక్క‌డికి వెళ్లినా.ఆమె ఏం చేస్తున్నా.

మంత్రికి చెప్పాల‌నే ష‌ర‌తు.అధికారుల మ‌ధ్య వినిపించింది.

ఇక‌, కుటుంబం కూడా ఆమెకు క‌లిసి రావ‌డం లేదు.

దీంతో తాను మంత్రిగా ఉన్నా.

ప్ర‌యోజ‌నం లేద‌ని ఆమె భావిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే పార్టీకి కూడా కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ఆమె ఎక్క‌డా క‌నిపించ‌లేదు.నిజానికి ఎప్పుడు అసెంబ్లీ జ‌రిగినా.

స‌భ‌లో ఆమె ఏదో ఒక టాపిక్‌పై మాట్లాడ‌డం, సీఎం జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేయ‌డం కామ‌న్‌గా జ‌రుగుతోంది.అయితే.

ఇప్పుడు జ‌రిగిన స‌భ‌లో ఆమె ఎక్క‌డా క‌నిపించ‌లేదు.పైగా స‌భ‌కు వ‌చ్చినా కూడా అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు .దీనికి కార‌ణం.కొన్నాళ్లుగా జిల్లాలో జ‌రుగుతున్న రాజ‌కీయాలేన‌ని అంటున్నారు.

ఆయా విష‌యాల‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా.ప‌ట్టించుకోలేద‌ని అందుకే ఆమె మౌనం పాటిస్తున్నార‌ని అంటున్నారు.

Telugu Ap Latest, Ap, Assembly, Latest, Pushpa Sreevani, Ysrcp-Telugu Political

నిజానికి ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉంటే.వారిలో ఒకింత యాక్టివ్‌గా ఉంటూ.టిక్ టాక్‌లు కూడా చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తు రాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ఆమె చ‌క్రం తిప్ప‌గ‌లుగుతున్నార‌ని, జిల్లా వ్యాప్తంగా ఆమె దూకుడు చూపించ‌లేక పోతున్నార‌ని కొన్నాళ్లుగా వినిపిస్తోంది.

మంత్రి బొత్స క‌నుస‌న్న‌ల్లోనే అధికారులు ప‌నిచేయ‌డం, ఆయ‌న ఆదేశాల మేర‌కే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం వంటివి స‌ద‌రు మంత్రికి ఇబ్బందిగా మారాయి.

స‌రే! వీటిని స‌రిచేసుకునే క్ర‌మంలో సొంత ఫ్యామిలీ నుంచే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

వీటిని ఎదిరించ‌డంలోను.ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డంలోను ఆమె వెనుక‌బ‌డ్డారు.

దీంతో అదిష్టానం కూడా ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని అంటున్నారు.మొత్తంగా దూకుడు మంత్రి మౌనం పార్టీలో చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube