కేంద్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకోవచ్చు అంటూ 45 రోజుల క్రితం అనుమతులు ఇచ్చింది.కాని ఇప్పటి వరకు దేశంలో కనీసం 20 శాతం థియేటర్లు కూడా నడుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
నడుస్తున్న థియేటర్లకు కూడా కనీసం 40 శాతం మంది ప్రేక్షకులు రావడం లేదు అంటున్నారు.ఇలాంటి సమయంలో థియేటర్లను ఎలా ఓపెన్ చేయాలంటూ చాలా మంది యాజమాన్యాలు అంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఓపెన్ కు సంబంధించిన అనుమతులు వచ్చాయి.అయితే ఇప్పటి వరకు థియేటర్లు ఓపెన్ కు సంబంధించిన సందడి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
తెలంగాణలో ఎన్నో ఆఫర్లు ఇచ్చి మరీ థియేటర్లను తెరుచుకోండి అంటూ కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.కాని థియేటర్లు మాత్రం ఇంకా మూత పడే ఉన్నాయి.
ఒక సర్వే ప్రకారం తెలంగాణలో థియేటర్లు ప్రస్తుతం 45 శాతం మాత్రమే ఓపెన్ అయ్యాయి.అది కూడా రోజులో రెండు లేదా మూడు షోలు మాత్రమే పడుతున్నాయి.ఈ కారణాల వల్ల థియేటర్ల నిజంగా ఓపెన్ అయ్యాయా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.డిసెంబర్ 1 నుండి థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని కొందరు భావించారు.
ఆ 1వ తారీకు కూడా వచ్చేస్తోంది.కాని థియేటర్లు ఓపెన్ విషయంలో స్పష్టత కరువు అయ్యింది.
జనాలు థియేటర్లు ఓపెన్ అయ్యాయా లేదా అనే మూడ్ లోనే ఉన్నారు.థియేటర్లకు వెళ్లాలి అనే ఆసక్తి జనాల్లో కనిపించడం లేదు.
కరోనా గురించి జనాలు మర్చి పోయినట్లుగా అనిపిస్తుంది.ఇదే సమయంలో థియేటర్ల గురించి కూడా మర్చి పోయారా అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సంక్రాంతికి సినిమాలు విడుదల అయితే అప్పుడు ఏమైనా థియేటర్ల వద్ద సందడి కనిపిస్తుందేమో చూడాలి.వచ్చే ఏడాదిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్ల యాజమాన్యాలు మరింత కుదేళు అవ్వడం ఖాయం అనిపిస్తుంది.