ఏంటీ... బేబమ్మ ఆ కన్నడ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందా..?

తెలుగులో ఇటీవలే నూతన దర్శకుడు బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన “ఉప్పెన” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “కృతి శెట్టి” గురించి సినిమా ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే బాక్సాఫీస్ వద్ద మంచి సాలిడ్ హిట్ ని అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

 Is Telugu Heroine Krithi Shetty Got Chance In Kannada Star Hero Yash Movie, Kann-TeluguStop.com

ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచేసింది.

తాజాగా ఈ అమ్మడు మరో స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. కాగా తెలుగులో కేజిఎఫ్ చిత్రంతో తనకంటూ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కృతి శెట్టిని చిత్ర యూనిట్ సభ్యులు హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తరహాలో ఉండటంతో ఈ అమ్మడు పారితోషకం కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు కిపైగా తీసుకుంటున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఏదేమైనప్పటికీ బేబమ్మ వచ్చీరావడంతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పాటు వరుస సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటూ దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరియు ప్రముఖ దర్శకుడు లింగు స్వామిల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న “శ్యామ్ సింగరాయ్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube