కరోనా టైమ్ లో ఈ నిర్మాత భార్యతో కలిసి హనీమూన్ కి వెళ్ళారా..?

తెలుగులో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా కొనసాగుతున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నిర్మాత దిల్ రాజు మొదట్లో సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా పని చేసేవాడు.

 Is Telugu Film Producer Dil Raju Went Honeymoon With His Wife In This Corona Pandemic-TeluguStop.com

క్రమక్రమంగా సినిమా పరిశ్రమలో పరిచయాలను పెంచుకుంటూ యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన దిల్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు.ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది.

దీంతో ఈ చిత్ర టైటిల్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు దిల్ రాజు.

 Is Telugu Film Producer Dil Raju Went Honeymoon With His Wife In This Corona Pandemic-కరోనా టైమ్ లో ఈ నిర్మాత భార్యతో కలిసి హనీమూన్ కి వెళ్ళారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ మధ్య దిల్ రాజు మొదటి భార్య అనిత పలు అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూయడంతో ఇటీవలే తేజస్విని అనే ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్నటువంటి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లయినప్పటి నుంచి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా గత కొద్ది కాలంగా దిల్ రాజు తన భార్యతో గడపడానికి సమయాన్ని వెచ్చించి లేకపోయాడు.దీంతో తాజాగా దిల్ రాజు తన భార్య తేజస్విని తో కలిసి హనీమూన్ కోసం అమెరికా కి వెళ్లినట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ హనీమూన్ ట్రిప్ దాదాపుగా మూడు వారాలపాటు ఉంటుందట.కాదా ఇటీవలే దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

దీంతో పనిలో పనిగా ఈ వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రం యొక్క బడ్జెట్ దాదాపుగా 2 వందల కోట్ల రూపాయలకు పైగా ఉండటంతో కేవలం పవన్ కళ్యాణ్ పారితోషకం కోసమే దాదాపుగా 75 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అలాగే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు తొందరలోనే మొదలు కానున్నట్లు కూడా తెలుస్తోంది.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#Tejaswini #Dil Raju #DIlRaju #IsTelugu #TeluguFilm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు