తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన, మరియు ఇతరత్రా పాత్రలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త బయటకు పొక్కిందంటే చాలు అందులో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు ఏవేవో కథనాలను ప్రచురిస్తూ ఉంటారు.
అయితే ఆ మధ్య హేమ కూతురు ఇషా తో టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తో పెళ్లి జరగబోతున్నట్లు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.దీంతో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి హేమ పాల్గొని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
అయితే తనకి దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నయ్యతో సమానమని అందువల్లనే చాలా చనువుగా ఉంటానని చెప్పుకొచ్చింది.అలాగే తన కూతురు ఇషా ని ఆకాష్ పూరి కి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై కూడా స్పందిస్తూ ఇప్పటి వరకు తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.
అంతేగాక తన కూతురు కూడా ఇటీవలే పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని తనతో చెప్పిందని తెలిపింది.
ఒకవేళ ఆమె ఎవరినైనా ప్రేమించినప్పటికీ తన కూతురి అభిప్రాయాన్ని గౌరవిస్తానని కూడా హేమ తెలిపింది.అలాగే అప్పట్లో పూరి జగన్నాథ్ పెళ్లి చేసే సమయంలో హేమ సహాయం చేసిన విషయం కూడా స్పందిస్తూ నిజమేనని తెలిపింది. అలాగే పూరి జగన్నాథ్ తన ఇంటి వద్దనే ఉండేవాడని అతడి గురించి అన్నీ తెలియడంతోనే ప్రేమ పెళ్లికి చేసుకునేందుకు సహాయం చేసానని కూడా తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెలుగులో “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.