తెలుగులో 100 కు పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “మామిళ్ల శైలజా ప్రియ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో శైలజా ప్రియ “సౌందర్య, ఆమని, సంఘవి,” తదితర స్టార్ హీరోయిన్ల స్నేహితురాలి పాత్రలో నటించి బాగానే ప్రేక్షకులని ఆకట్టుకుంది.
అయితే మొదటిగా నటి శైలజా ప్రియ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి నటిగా పరిచయం అయినప్పటికీ క్రమక్రమంగా చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంది.దీంతో ఆ మధ్య పెళ్లి చేసుకోవడంతో కొంతకాలం పాటూ నటనకు బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య పలు చిత్రాలు, సీరియళ్లలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.కాగా ఆ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “మిర్చి” చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే తాజాగా నటి శైలజా ప్రియ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఇటీవలే ఈ అమ్మడికి బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో నుంచి కబురు వచ్చినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా నటి శైలజా ప్రియా బిగ్ బాస్ 5వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందని ఇందుకుగాను శైలజా ప్రియా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు.

కాగా గత ఏడాది సినీ సెలబ్రిటీలు లేక బిగ్ బాస్ షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ ఏడాది షో నిర్వాహకులు సెలబ్రిటీల వేటలో పడ్డారు.అంతేగాక ఇప్పటికే ఈ షోలో తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ షో నిర్వాహకులు మాత్రం స్పందించడం లేదు.
కాగా ప్రస్తుతం శైలజా ప్రియ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ అయిన జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమవుతున్న “నెం 1 కోడలు” ధారావాహికలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది షోలో బిగ్ బాస్ షోలో హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈసారి తప్పుకున్నట్లు సమాచారం.
దీంతో బిగ్ బాస్ ఐదవ సీజన్లో టాలీవుడ్ ప్రముఖ హీరో “రానా దగ్గుబాటి” హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.