తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయిందా.. !?

రాజకీయనాయకులు సాధ్యం కాని పధకాలను కూడా అమలు చేస్తూ పదవుల కోసం, స్వార్ధంతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను సోమరిపోతుల్లా మారుస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారట.ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే వారున్న సమాజంలో అన్నీ ఉచితంగా ఇస్తున్నారని ఆశపడుతున్న ప్రజలు ఉచితం చాటున తామెంత నష్టపోతున్నామనే విషయాన్ని గ్రహించలేక పోతున్నారు.

 Is Telangana State Government Treasury Empty Again-TeluguStop.com

ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుల ఆస్తులు జప్తు చేస్తే తెలంగాణ రాష్ట్రం పై ఉన్న అప్పులు దాదాపుగా తీరేటంతగా ఒక్కో నాయకుడు వెనకేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇలాంటి సంక్లిష్టపరిస్దితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయిందనే ప్రచారం జరుగుతుంది.

 Is Telangana State Government Treasury Empty Again-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయిందా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా ట్రెజరీలో ముఖ్యమైన బిల్లుల చెల్లింపులకు కూడా బ్రేక్‍ పడిందని, దాదాపు ఏడాదిన్నర నుంచే పలు బిల్లులు ఆపివేయగా, ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి మళ్లీ కిందిస్థాయి బిల్లులు కూడా నిలిపి వేశారని సమాచారం.ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.19వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉండటంతో ఆయా శాఖల్లో పనులకు బ్రేక్​ వేశారట.మరీ ఈ విషయాన్ని గమనించని ప్రజలు తెలంగాణ ఏదో అభివృద్ధిబాటలో పయనిస్తుందనే గాలివార్తలకు ఉబ్బిపోయి బానిసలుగా మారుతున్నారని కొందరి అభిప్రాయమట.

#Freezing #Funds #Telangana #Treasury Empty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు