బండి సంజయ్ బంగారం లాంటి అవకాశం చేజార్చుకుంటున్నారా?

తెలంగాణలో బీజేపీ బలం బాగా పెరిగిందన్న సంగతి 2019 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలిచినప్పుడే అర్థమయింది.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి నేతలు పదునైన వ్యహాలు రచిస్తున్నారు.

 Is Telangana State Bjp Chief Bandi Sanjay Missing The Golden Chance Of Padayatra-TeluguStop.com

రాష్ట్ర అధినాయకత్వంలో మార్పులు కూడా జరిగాయి.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్‌గా నియమించారు.

ఇక అప్పటి నుంచి కమలదళంలో ఊపు, జోష్ వచ్చింది.కాషాయశ్రేణులు కదం తొక్కుతున్నాయన్న పరిస్థితి క్రియేట్ అయింది.

 Is Telangana State Bjp Chief Bandi Sanjay Missing The Golden Chance Of Padayatra-బండి సంజయ్ బంగారం లాంటి అవకాశం చేజార్చుకుంటున్నారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీలోనూ బీజేపీ తన విజయ పరంపరను కొనసాగించింది.ఈ నేపథ్యంలోనే కమలం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం బీజేపీ పోరాడుతున్నది.

ఈ నెల 9 నుంచి పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే, ఈ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై వారి పరిస్థితులు, సమస్యలు తెలుసుకుని రాజకీయ కార్యచరణ ప్రకటించొచ్చు.

కాగా, తాజాగా ఆ పాదయాత్రకు బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది.తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్స్‌ను కవర్ చేసేలా పాదయాత్ర ఉంటుందని గొప్పగా చెప్పిన కథ అంతా ఇప్పుడు ఉట్టిదే కాబోతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Bjp, Central Bjp, Kishan Reddy, Missing The Golden Chance, No Permission, Padayatra-Telugu Political News

బీజేపీ కేంద్ర అధినాయకత్వం ఈ పాదయాత్రకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది.ఇందుకు బీజేపీలోని సీనియర్ నేతలు పావులు కదిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తంగా ‘బండి’ జోరు పార్టీలోనే తగ్గించేయాలని కొందరు భావిస్తున్నట్లు పార్టీలోనే అంతర్గత చర్చ నడుస్తున్నది.ఇటీవల కాలంలో సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కూడా అదే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీలో బండి సంజయ్ మాటలకు విలువ ఉండటం లేదని, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాటలకే విలువ ఉంటున్నదని కొందరు ఆరోపిస్తున్నారు.అయితే, బండి నేతృత్వంలో పార్టీకి జోష్ వచ్చిందని చెప్పే వారు చాలా మందే ఉన్నారు.

#Kishan Reddy #No Permission #Padayatra #Bandi Sanjay #MissingThe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు