తెలంగాణ కాంగ్రెస్ ఇక అంతేనా ? ఎవరూ మార్చలేరా ?

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సొంత పార్టీలోనే విపక్షం అన్నట్టుగా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి.

 Is Telangana Congress That Much Can No One Change Telangana, Trs, Kcr,ktr, Yasva-TeluguStop.com

ఒకరిపై ఒకరు సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసుకుంటూ, అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ వస్తుంటారు.పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడం,  జూనియర్ నాయకుల పెత్తనం సహించేది లేదన్నట్లుగా వారు వ్యవహరించడం ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతూనే ఉన్నాయి.

మరోవైపు చూస్తే టిఆర్ఎస్ బిజెపిలు ఎన్నికల్లో గెలిచేందుకు పోటా పోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూనే ఉంది.

ఇటీవల వరంగల్ సభకు కాంగ్రెస్ కీలక నేత   రాహుల్ గాంధీ హాజరయ్యారు.

  ఆ సమయంలోనే గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ ఐక్యంగా పనిచేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకులందరికీ హిత బోధ చేశారు.

ఆ సమయంలో అంతా ఐక్యంగా ఉన్నట్టుగానే కనిపించారు.మొన్నటి వరకు అదే పరిస్థితి కనిపించినా, ఇప్పుడు మాత్రం ఒకసారి గా మార్పు వచ్చింది.

ముఖ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి  యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వచ్చారు.అయితే ఆయనకు కాంగ్రెస్ మద్దతు పలికినా.

కేసీఆర్ ను కలిసినందుకు ఆయన రావడం తో ఆయన్ను కలవకూడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.కెసిఆర్ ను కలిసేందుకు వచ్చిన ఆయన తమను కలవాలన్న,  తాము కలిసేది లేదు అంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

అయితే యశ్వంత్  సిన్హా బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన  సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్వాగతం పలకడంతో, రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.   

Telugu Jagga, Pcc, Rahul Gandhi, Telangana, Yasvanth Sinha-Politics

  పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా బండ కేసి కొడతానంటూ రేవంత్ వ్యాఖ్యానించడంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓర్పులేని వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత లేదని అన్నారు.4 నెలలుగా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడకుండా ఉన్నానని,  ఇప్పుడు రేవంత్ రెడ్డి తనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.పిసిసి అధ్యక్షుడిన తొలగించాలని అధిష్టానానికి లేఖ రాయబోతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.యశ్వంత్ సిన్హా సీనియర్ నేత వి.హనుమంతరావు కలవడంలో తప్పేముందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.పార్టీలో చేరికలపై రేవంత్ ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని, ఆయా జిల్లాల నాయకులకు కూడా సమాచారం ఇవ్వకుండా నాయకులను చేర్చుకుంతున్నారని ఫైర్ అయ్యారు.

జగ్గారెడ్డి మాదిరి గానే కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు రేవంత్ తీరు పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు.   

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube