టీడీపీ ఆశ‌ల‌కు బ్రేక్ ప‌డిన‌ట్టేనా.. పొత్తుపై అమిత్ షా క్లారిటీ..?

రాజ‌కీయాలు అంటేనే క‌లుపుకు పోవ‌డం.అవ‌స‌రాన్ని బ‌ట్టి ఎంత‌టి శ‌త్రువును అయినా స‌రే క‌లుపుకుని అధికారాన్ని చేజిక్కించుకోవ‌డం మ‌న రాజ‌కీయ నేత‌ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

 Is Tdp's Hopes Broke. Is Amit Shah's Clarity On The Alliance ..tdp, Amit Shah-TeluguStop.com

ఇక చంద్ర‌బాబు లాంటి దిగ్గ‌జ నేత‌కు బాగా అలవాటు ఉన్న ప‌ని.ఆయ‌న మొద‌టి నుంచి పొత్తుల‌తోనే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు.

ఆనాడు టీఆర్ ఎస్‌తో, వామ ప‌క్షాల‌తో ఆ త‌ర్వాత బీజేపీతో, జ‌న‌సేన‌తో ఇలా పొత్తులు పెట్టుకున్నారు.ఇలా పొత్తులు పెట్టుకున్న చాలాసార్లు ఆయ‌న అధికారంలోకి వ‌చ్చారు.

మ‌రీ ముఖ్యంగా 2014లో జ‌న‌సేన‌, బీజేపీల అండ‌తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

అయితే 2019 ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు దూరం కావడంతో ఆయ‌న అధికారానికి దూరం అయిపోయారు.

ఇప్పుడు మ‌ళ్లీ 2014 ఫార్ములాను రిపీట్ చేయాల‌నుకుంటున్నా కుద‌ర‌ట్లేదు.బీజేపీ అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది.

అయితే ఇన్ని రోజులు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూసిన చంద్ర‌బాబుకు నిరాశే మిగిలింది.మొన్న తిరుప‌తికి వ‌చ్చిన అమిత్ షా చంద్ర‌బాబును మాత్రం క‌ల‌వ‌లేదు.

పైగా టీడీపీలో పొత్తు విష‌యంలో కూడా బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు అమిత్ షా క్లారిటీ ఇచ్చేశారంట‌.

Telugu Amit Shah, Amith Shah, Ap, Cm Jagan, Tdpshopes, Ysrcp-Telugu Political Ne

ప్ర‌స్తుతం వైసీపీతో ఎంత దూరం ఉన్నామో టీడీపీతో కూడా అంతే దూరాన్ని మెయిన్‌టేన్ చేయాలంటూ చెప్పేశారంట‌.

అంటే ఇన్ని రోజులు టీడీపీ పెట్టుకున్న ఆశ‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టినట్లయింది.ఇక భవిష్య‌త్‌లో అవ‌స‌రాన్ని బ‌ట్టి ద‌గ్గ‌ర‌కు తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నా అది ఎంత వ‌ర‌కు నిజ‌మో చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఎందుకంటే అమిత్ షాకు ఏపీలో గెల‌వ‌డం క‌న్నా కేంద్రంలో గెల‌వ‌డ‌మే ఇంపార్టెంట్‌.ఇందుకోసం వైసీపీ స‌పోర్టు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది.

అంటే మొత్తానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నానికి అమిత్ షా బ్రేక్ వేశార‌న్న‌మాట‌.మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి వ్యూహాల‌ను ర‌చిస్తారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube