చికాగో సెక్స్‌ రాకెట్‌.. టీడీపీకి లింక్‌ ఏంటి?       2018-06-22   04:05:43  IST  Raghu V

అమెరికా, టాలీవుడ్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోయిన్స్‌ను ఈవెంట్స్‌ పేరుతో అమెరికాకు రప్పించి, వారితో అక్కడ వ్యభిచారం చేయించడం కిషన్‌ పని. హీరోయిన్స్‌ అందుకు ఒప్పుకోకుంటే వారిని బలవంతం చేయడం కూడా ఆయన చేసేవాడు. అక్కడ పోలీసు వారు చెబుతున్న దాని ప్రకారం వందల మంది టాలీవుడ్‌ సెలబ్రెటీలు అమెరికాలో వ్యభిచారం చేసినట్లుగా, కిషన్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. అమెరికా పోలీసులు ప్రస్తుతం ఎంక్వౌరీని మరింత లోతుగా చేస్తున్నారు. ఈ సమయంలోనే అమెరికా తెలుగు సంఘాల అధ్యక్షులను ప్రశ్నిస్తున్నారు.

తెలుగు సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వారిని పిలిపించడం జరిగింది. కనుక తెలుగు సంఘాల వారికి సెక్స్‌ రాకెట్‌తో సంబంధం ఉందా అనే కోణంలో అక్కడ పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే ఈ వివాదంలోకి టీడీపీని లాగేందుకు వైకాపా ప్రయత్నాలు చేస్తోంది. తీగ కనిపిస్తే డొంక లాగేందుకు ప్రయత్నించే వైకాపా ప్రస్తుతం టీడీపీ పరువు తీసేందుకు సిద్దం అయ్యింది. అమెరికా సెక్స్‌ రాకెట్‌ విషయంలో చిన్న లింక్‌ టీడీపీకి కలిసింది. దాంతో వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో టీడీపీపై దుమ్ము ఎత్తి పోస్తున్నారు. తాజాగా వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ టీడీపీపై ఆరోపణలు చేశారు.

తానా అధ్యక్షుడు వేమన సతీష్‌కు సెక్స్‌ రాకెట్‌తో సంబంధం ఉందని అనుమానిస్తున్న అమెరికా పోలీసులు దాదాపు ఆరు సార్లు ఆయన్ను పిలిచి ఎంక్వౌరీ చేయడం జరిగింది. ఈ విషయమై పలు తెలుగు సంఘాల ప్రతినిధులను కూడా పిలిచి ఎంక్వౌరీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వేమన సతీష్‌కు తెలుగు దేశం పార్టీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్‌కు ఆప్త మిత్రుడిగా వేమన సతీష్‌ ఉన్నారు. అందుకే ఆయన్ను పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్న నేపథ్యంలో వైకాపా నాయకు టీడీపీకి ఈ వ్యవహారంలో సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సతీష్‌తో పాటు కోమటి జయరాంను కూడా అక్కడ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈయన నార్త్‌ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఏపీకి సంబంధించిన వ్యవహారాలు ఆయన చూసుకుంటాడు. ఈయన కూడా తెలుగు దేశం పార్టీకి ఆప్తుడు, మిత్రుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో సన్నిహిత్యం ఉన్న ఈయన్ను కూడా సెక్స్‌ రాకెట్‌లో ప్రశ్నించిన కారణంగా వైకాపా వారి ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.