'సైరా' మేకర్స్‌ కూడా అదే తప్పు చేశారా?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

 Is Sye Raa Narasimha Reddy Movie Making Looks Like Sahoo Prabhas-TeluguStop.com

ఈ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ దాదాపుగా 275 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.రామ్‌చరణ్‌ తన తండ్రి కోసం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించాలనే ఉద్దేశ్యంతో 100 కోట్ల నుండి ఏకంగా 275 కోట్లకు తీసుకు వెళ్లాడు.

చిరంజీవిపై అంత బడ్జెట్‌ పెట్టడం ఎంత పెద్ద సాహసమో ప్రస్తుతం చరణ్‌కు అర్థం అవుతుంది.అయితే చరణ్‌ నిర్మాతగా మాత్రం ఎలాంటి టెన్షన్‌ పడటం లేదు.

Telugu Chiranjeevi, Nayanatara, Prabhas, Ramcharan, Sahoo, Sahoo Budget, Syeraa,

  ఇప్పటికే ప్రీ రిలీజ్‌బిజినెస్‌ ఒక మోస్తరుగా జరిగింది.ఇక ఇతర రైట్స్‌ ద్వారా పెట్టుబడికి దాదాపుగా దగ్గర మొత్తం వచ్చింది.250 కోట్ల వరకు రావడంతో చరణ్‌ సేఫ్‌ అయినట్లే భావించొచ్చు.అయితే భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన బయ్యర్ల పరిస్థితి ఏంటీ అనేదే ఇప్పుడు ప్రశ్న.

వందల కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సైరా చిత్రం నిరాశ పర్చితే పరిస్థితి దారుణంగా ఉంటుందని సైరా బయ్యర్లకు తెలుసు.అయినా కూడా సినిమాపై ఉన్న నమ్మకంతో వారు భారీ మొత్తాలను కోట్‌ చేసి మరీ కొనుగోలు చేయడం జరిగింది.

Telugu Chiranjeevi, Nayanatara, Prabhas, Ramcharan, Sahoo, Sahoo Budget, Syeraa,

  సైరా చిత్రం 150 కోట్లతో పూర్తి అయ్యి ఉంటే బయ్యర్లు మరియు నిర్మాతకు భారీ లాభాలు వచ్చేవి.సాహో చిత్రం 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కారణంగా బాగానే ఆడినా కూడా భారీ నష్టాలు మూట కట్టుకోవాల్సిన పరిస్థితి.అందుకే సైరా చిత్రం బడ్జెట్‌ విషయంలో కూడా తప్పు జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.150 కోట్లు లేదా 200 కోట్ల వరకు బడ్జెట్‌ పెట్టి ఉంటే సరిపోయేది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube