సునీల్ నువ్విక మారవా..!

పూటకో హీరో పుట్టుకొస్తున్న ఈ తరుణంలో స్టార్ హీరోలతో సహా తమ ఉణికిని చాటుకునేందుకు కష్టపడుతున్నారు.ఓ పక్క ఇమేజ్ చట్రం అంటూనే మరో వైపు ప్రయోగాల పని పడుతున్నారు.

 Is Sunil Will Impres With Jakkanna..?-TeluguStop.com

అయితే అటు హీరోకి ఇటు కమెడియన్ కాకుండా మధ్యలో ఉన్న హీరో టర్నెడ్ స్టార్ కమెడియన్ సునీల్ ఎటు తేల్చుకోలేకుండా ఉన్నాడు.ప్రస్తుతం సునీల్ చేస్తున్న సినిమా జక్కన్న.

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సునీల్ తో మన్నార్ చోప్రా రొమాన్స్ చేస్తుంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే సునీల్ మళ్లీ తన పాత పద్ధతిలో వెళ్లినట్టున్నాడు.

ఓ కామెడీ గ్యాంగ్.నాలుగు డ్యాసు బిట్లు.

ఇక తన హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ఇవే కొంతకాలంగా సునీల్ సినిమాల్లో చూస్తున్నవి.ఇప్పుడు రిలీజ్ అయిన జక్కన్న టీజర్ లో కూడా మళ్లీ అదే ఫార్ములా కనబడుతుంది.

మరి ఓ పక్క కుర్ర హీరోలంతా పోటీ పడిమరి కొత్త ప్రయత్నాలతో వారెవా అనిపించుకుంటుంటే సునీల్ మాత్రం ఏమాత్రం కొత్తగా ప్రయత్నించకపోడానికి కారణాలు ఏమై ఉంటాయ అన్నది అర్ధం కావట్లేదు.కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోగా మారిన సునీల్ కమెడియన్ గా ఉన్న క్రేజ్ అంతా పోగొట్టుకున్నదే కాకుండా హీరోగా అపవాదాలు మూటకట్టుకుంటున్నాడు.

మరి సునీల్ హీరోగా సూపర్ హిట్ ఎప్పుడు కొడతాడో అని సిని విమర్శకులు సైతం ఎదురుచూస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube