సాహో తప్పునే మళ్లీ రిపీట్ చేస్తున్న ప్రభాస్..?

బాహుబలి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్ల తరువాత సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ నటించిన సాహో సినిమా గతేడాది విడుదలై డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో కథ, కథనంలో లోపాలు ఉండటంతో పాటు బాలీవుడ్ నటులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.

 Is Star Hero Prabhas Repeating Same Mistake For Saaho Movie, Aadhipurush, Repeat-TeluguStop.com

తెలుగు నటులు ఉండేలా జాగ్రత్త పడి ఉంటే ఈ సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విషయంలో సాహో తప్పునే మళ్లీ రిపీట్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్ ఫైనల్ అయినట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో ఇతర పాత్రలకు సైతం బాలీవుడ్ నటులనే ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.

దీంతో ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ లో వర్కవుట్ అయినా టాలీవుడ్ లో వర్కవుట్ అవుతుందా.? అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సౌత్ ఇండియాలో పాపులర్ నటులకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సాహో సినిమా డబ్బింగ్ సినిమాను తలపించిందని ఆదిపురుష్ సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా ప్రభాస్ జాగ్రత్త పడితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమాను ఐదారు భాషల్లో విడుదల చేస్తున్న మూవీమేకర్స్ కాస్టింగ్ విషయంలో పొరపాట్లు చేస్తే ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశాలు ఉన్నాయి.

దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా 2022 ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube