భవిష్యత్ ఎన్నికలలో సోషల్ మీడియానే ఇక కీలక పాత్ర పోషించబోతోందా?

ప్రస్తుతం అంతా ఎలక్ట్రానిక్ మీడియాతో పోలిస్తే సోషల్ మీడియా అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తోంది.ఒకప్పుడు సోషల్ మీడియాలో గడిపే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది.

 Is Social Media Going To Play A Key Role In Future Election Trs Party, Bjp Part-TeluguStop.com

కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు.ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటుండడంతో ఇక అన్ని రకాలుగా సోషల్ మీడియాలో పార్టీలు కూడా తమ సొంత పేజీ ఏర్పాటు చేసుకొని తమ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకపడుతున్న పరిస్థితి ఉంది.

ఇక దీంతో ప్రతి ఒక్క పార్టీ కూడా సోషల్ మీడియాను కీలకంగా తీసుకోవడంతో ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతోంది.

ఎంతలా అంటే ఏ పార్టీ ఎంతలా ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేక ప్రచారం చేయడంలో సత్తా చాటితే సదరు పార్టీ ఎన్నికలో గెలిచే అవకాశాలను మెరుగుపరుచుకుంటోంది.

  అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇక పూర్తి స్థాయి రాజకీయ యుద్దాలు సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.ఇప్పటికే అన్ని పార్టీలు సోషల్ మీడియాలో తమ ప్రభావం పెంచుకునే దిశగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది.

ఉదాహరణకు హుజూరాబాద్ ఉప ఎన్నికను తీసుకుంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ నెలకొన్న సంగతి తెలిసిందే.అయితే గెలుపు కొరకై ఇరు పార్టీలు ఎంతలా కృషి చేస్తున్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం.

Telugu Bjp, Congress, Etala Rajender, Huzurabad, Key Role, Trs-Political

ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం ఇంతలా హాట్ టాపిక్ గా మారడానికి సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఒకప్పుడు దుబ్బాక, ప్రస్తుతం హుజూరాబాద్ ఇలా చాలా వరకు జరిగిన ఎన్నికలలో ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది.మరి సోషల్ మీడియా ప్రభావంతో రాజకీయాలు ఎంతలా మారుతాయనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube