పార్టీ ఉనికి కోసమే షర్మిల పాదయాత్ర చేపడుతోందా?

Is Sharmila Hiking For The Sake Of Party Existence

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పాదయాత్రల సంస్కృతి అనేది మొదలైందనే చెప్పవచ్చు.ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో మొదటి దఫా పాదయాత్రను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన విషయం తెలిసిందే.

 Is Sharmila Hiking For The Sake Of Party Existence-TeluguStop.com

అయితే తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల  నాలుగు వేల కిలోమీటర్ ల పాదయాత్రకు శ్రీకారం చేపట్టిన విషయం తెలిసిందే.షర్మిల తన పార్టీ ఏర్పాటు చేసినా ప్రజల్లో మాత్రం పెద్దగా స్పందన రాలేదనే విషయం తెలిసిందే.

నిరుద్యోగ దీక్షలు చేపట్టినా ప్రజలు సదరు దీక్షలను సీరియస్ గా తీసుకోకపోగా నెటిజన్ల చేతిలో అక్కడ దీక్షకు హాజరైన వారికి డబ్బులు ఇవ్వలేదని దీక్షకు హాజరైన మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.దీంతో షర్మిల దీక్ష చేపట్టిన అంశం పక్కదారి పట్టింది.

 Is Sharmila Hiking For The Sake Of Party Existence-పార్టీ ఉనికి కోసమే షర్మిల పాదయాత్ర చేపడుతోందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చాలా విషయాలు షర్మిల సీరియస్ నాయకురాలిగా ప్రజల్లో గుర్తింపు పొందకుండా అడ్డుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే ప్రస్తుతం షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్ర గురించి ఇటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ స్పందించలేదు.

Telugu @cm_kcr, Bandi Sanjay, Sharmila, Telangana, Yssharmila, Ysr Telangana, Ysrtp-Political

అయితే తనకంటూ ఒక పార్టీ ఉందని ప్రజలకు తెలియాలని, ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పాదయాత్ర చేపడుతున్నదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి మనం చూస్తున్నాం.ఇక ఈ జాబితాలో వై.ఎస్.షర్మిల పార్టీ కూడా చేరినట్టయింది.ప్రతి ఒక్కరూ రాజకీయంగా తమను తాము నిలబెట్టుకోవడానికి పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి వస్తున్నారన్న భావన కూడా ప్రజల్లో క్రమంగా వస్తోంది.

ఏది ఏమైనా షర్మిల పాదయాత్ర ఎంత మేర ప్రజలను ఆకట్టుకుంటుందనేది చూడాల్సి ఉంది.

#Sharmila #YSR Telangana #Telangana #Bandi Sanjay #@CM_KCR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube